ఇటీవల రిలీజ్ అయి చాలా విమర్శలను ఎదుర్కొని నిలబడిన సినిమా ‘ది కేరళ స్టోరీ’( The Kerala story )…ఈ చిత్రం ఎన్ని వివాదాలకు దారి తీసిందో అందరికీ తెలుసు.అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎంత భారీగా కలెక్ట్ చేసిందో కూడా అందరూ చూశారు.బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.235 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది.దర్శకుడు సుదీప్తో సేన్( Sudeepto Sen ) తెరకెక్కించిన ఈ చిత్రం… కేరళలో అమాయకపు అమ్మాయిలను లవ్ జిహాద్( Love Jihad ) పేరుతో మతమార్పిడి చేసి వారిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద క్యాంపుల్లోకి పంపడం, వాళ్ళ పై లైంగికంగా దాడి చేయడం వంటి అంశాలను చూపించారు.

అయితే ఇది హింసని ప్రేరేపించినట్టు, వివాదాస్పదంగా ఉన్నట్లు భావించి విడుదలను అడ్డుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు.అయినా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇందులో నటించిన నటీనటులు అందరికీ మంచి పేరొచ్చింది.
అయితే ఇలాంటి సంఘటన ఇప్పుడు నిజజీవితంలో చోటు చేసుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది.వివరాల్లోకి వెళితే… నటుడు తన్వీర్ అక్తర్ ఖాన్ ప్రేమ ‘లవ్ జిహాద్’ వంటిది అని మాన్వి రాజ్ సింగ్( Manvi Raj Singh ) సంచలన వ్యాఖ్యలు చేసింది.
తన ఐడెంటిటీని దాచేసి అతను ఆమెకు యష్ గా పరిచయమయ్యాడట.‘నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని ఇస్లాం మతంలోకి మార్చాడు.
అతను నన్ను చంపేసేలా ఉన్నాడు.నేను హిందువునే.
హిందువుగానే ఉంటాను.ఎప్పటికీ ముస్లింను కాలేను.
ఆ కమ్యూనిటీకి చెందిన వారిని వివాహం చేసుకోలేను.

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నన్ను ఈ రాక్షసుడి నుండి కాపాడండి.మాకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడు.2021 నుండి నన్ను రేప్ చేస్తూనే ఉన్నాడు.‘ది కేరళ స్టోరీ’ చూసిన తర్వాత ఆ సంఘటన గురించి బహిరంగంగా చెప్పగలుగుతున్నాను’ అంటూ మాన్వి రాజ్ సింగ్ పేర్కొంది…
.