భువనగిరి మండల పరిధిలోని బొల్లెపల్లిలో ఉద్రిక్తం...!

యాదాద్రి-భువనగిరి జిల్లా:భువనగిరి మండల పరిధిలోని బొల్లెపల్లి రైతు వేదికలో శనివారం నిర్వహించిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు,భువనగిరి నియోజక ఇన్‌చార్జి కుంభం అనిల్ కుమార్ రెడ్డి( Anil Kumar Reddy ) అధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు.రెండు నెలలు గడుస్తున్నా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా సంబరాలు ఎందుకంటూ అనీల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిని నిలదీశారు.

 Tension In Bollepalli Under Bhuvanagiri Mandal , Bhuvanagiri Mandal-TeluguStop.com

రైతులు ఆకలితో అలమటిస్తుంటే మీరు సంబరాలు చేస్తారా అంటూ రైతు సమస్యలను ప్రస్తావిస్తూ వాగ్వాదానికి దిగారు.రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసిత రైతులపై కేసులు పెట్టి జైలు పాలు చేసిన మీ పార్టీకి రైతు ఉత్సవాన్ని నిర్వహించే అర్హత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనితో బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీ వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వావాదం పెరిగి,ఇరు వర్గాల మధ్య తోపులాట జ‌రిగింది.రైతు వేదికలోని కుర్చీలను ఒకరిపై ఒకరు విసిరేసుకావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను నియంత్రించారు.కానీ, సమావేశంలో జ‌రిగిన రభసతో రైతు ఉత్సవ కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube