కాళ్లు, చేతులు కదల లేని స్థితిలో ఉంటే ఆ బాధ వర్ణనాతీతం.అసలు ఆ ఊహే చాలా మందిని భయపెడుతుంది.
కానీ ఓ వ్యక్తి గత 70 ఏళ్లుగా ఇలా కదల్లేని స్థితితో జీవిస్తున్నాడని మీకు తెలుసా? అలాంటి పరిస్థితుల్లోనే ఆయన డిగ్రీ కూడా పూర్తి చేశాడు.అంతేకాకుండా ఒక పుస్తకం కూడా రాశాడు.
అతడి పేరు పాల్ అలెగ్జాండర్( Paul Alexander )అతని వయస్సు 77 సంవత్సరాలు.అతన్ని పోలియో పాల్ అని కూడా పిలుస్తారు.
అతను 1952 సంవత్సరంలో 6 సంవత్సరాల వయస్సులో పోలియో బారిన పడ్డాడు.ఇప్పటి వరకు జీవించి ఉన్న పోలియో బాధితులలో అత్యంత పెద వయస్కుడిగా ఆయన పేరు గిన్నిస్ రికార్డులో ఎక్కింది.

పాల్ 1946 సంవత్సరంలో అమెరికాలోని డల్లాస్( Dallas )లో జన్మించాడు.అప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాడు.గత సంవత్సరం, ప్రజలు అతని కోసం 1,32,000ల డాలర్ల విరాళం సేకరించారు.1952లో అమెరికా చరిత్రలో అతిపెద్ద సంఖ్యలో పోలియో వ్యాప్తి చెందింది.వ్యాధి వేగంగా వ్యాపించింది.కనీసం 58,000 కేసులు నమోదయ్యాయి.బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు.పాల్‌కి కూడా పోలియో వచ్చింది.
దీంతో అతని శరీరం చచ్చుబడిపోయింది.మెడ కింద భాగం పని చేయడం లేదు.
తర్వాత శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఏర్పడింది.

అమెరికా( America ) 1979లో పోలియో రహిత దేశంగా ప్రకటించుకుంది.కానీ అప్పటికి పాల్‌కి చాలా ఆలస్యం అయిం ది.వ్యాధితో పోరాడేందుకు ఇనుప ఊపిరితిత్తుల యంత్రంలో ఉంచారు.
ఈ యంత్రాన్ని 1928లోనే కనుగొన్నారు.సాంకేతికత అభివృద్ధి కారణంగా, 60 ల తర్వాత వాటిని తయారు చేయడం ఆగిపోయింది.
ప్రస్తుతం ప్రపంచంలో ఆ యంత్రంలో నివసిస్తున్న ఏకైక వ్యక్తి పాల్.టెక్నాలజీ అభివృద్ధి చెందింది కానీ పాల్ ఈ మెషీన్‌లోనే ఉండిపోయాడు.
అతను యంత్రం వెలుపల శ్వాస తీసుకోవడం కూడా నేర్చుకున్నాడు.దీనిని “కప్ప శ్వాస” టెక్నిక్ అంటారు.
పాల్ నెమ్మదిగా గొంతు కుహరంలో గాలిని బంధించడం ప్రారంభించాడు మరియు థెరపిస్ట్ ఆదేశాల మేరకు కండరాలకు శిక్షణ ఇచ్చాడు.ఇన్ని కష్టాలు పడుతున్నా తన కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
లా డిగ్రీ పూర్తి చేశాడు.అంతేకాకుండా ఒక పుస్తకం కూడా రాశాడు.
అతను తన నోటి సహాయంతో కూడా పెయింట్ కూడా చేస్తాడు.అతడి కథ తెలిసిన వారంతా కన్నీళ్లు పెడుతున్నారు.







