భారత్ ఇప్పుడిప్పుడే వివిధ క్రీడల్లో తన సత్తా చాటుతోంది.తాజాగా ఆసియా క్రీడల్లో “అనూష్ అగర్వాల్( Anush Agarwalla )” చరిత్ర సృష్టించాడు.
దాంతో ఈక్వెస్ట్రియన్ డ్రెసేజ్ (గుర్రపు స్వారీ) వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వ్యక్తిగా చరిత్ర పుట్టల్లో తన పేరుని లిఖించుకున్నాడు.ఈ గురువారం జరిగిన డ్రెసేజ్ ఈవెంట్ ఫైనల్లో అనూస్ 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
కాగా ఇక్వెస్ట్రియన్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.ఇక టీమ్ ఈవెంట్‌లో ఇప్పటికే భారత్ స్వర్ణ పతకం గెలుచుకున్న సంగతి గురించి మీరు వినే వుంటారు.
అనూష్ అగర్వాల్, హృదయ్ విపుల్, సుదీప్తి హజెలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత జట్టు మొన్నటికి మొన్న ఈక్వెస్ట్రియన్ డ్రెసెజ్ ఈవెంట్‌లో తొలి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కొల్లగొట్టగా ఇప్పుడు తాజాగా అనూష్ ఈ విభాగంలో భారత్( India )కు రెండో పతకాన్ని అందించడం చాలా గర్వకారణం.ఇక ఇక్కడ మీ అందరికీ ఈక్విస్ట్రియన్ డ్రెసెజ్ అంటే ఎంటో తెలుసుకోవాలనే ఆసక్తి వుండే వుంటుంది.డ్రెసెజ్ అనే ఫ్రెంచ్ పదానికి ఇంగ్లీష్‌లో ట్రెయినింగ్ అని అర్ధం.ఇందులో రైడర్ తన గుర్రానికి సూచనలు ఇస్తూంటాడు. రైడర్ సూచనలకు అనుగుణంగా గుర్రం ఎలా ప్రవర్తిస్తుందో దాన్ని బట్టి ఈ ఆటలో పాయింట్లు అనేవి వుంటాయి.
ఇంకా డీప్ గా చెప్పాలంటే ఈ ఆటలో రైడర్ తన గుర్రానికి( Horse riding ) ఎలా శిక్షణ ఇచ్చాడు, అదేవిధంగా వారిద్దరి మధ్య కో ఆర్డినేషన్ ఎలా ఉందనే అంశాలను ముఖ్యంగా న్యాయ నిర్ణేతలు పరిగణనలోకి తీసుకొని మరీ వారికి పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది.ఈ క్రీడలో ఇప్పుడిప్పుడే మనవాళ్లు ఆసక్తి కనబరుస్తున్నారు.ఇందులో ఇప్పటి వరకు ఫారిన్ దేశాలు మాత్రమే చాలా ఆసక్తిని కనబరిచేవి.
కాగా నూతన అంకంతో దేశంలో మరింతమంది క్రీడకారులు తయారవుతారని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.