నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం పోర్టులో వైజయంతి కంపెనీ చెందిన 743 నంబర్ గల డ్రాప్ సర్వే బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది.భారీ నౌకలు ఓడరేవుకు వచ్చేందుకు పైలెట్ గా వ్యవహరిస్తున్న డ్రాప్ సర్వే బోటును తమిళనాడుకు చెందిన ఫైబర్ బోటు ఢీకొనడంతో నిమిషాల వ్యవధిలో సముద్రంలో మునిగిపోయింది.
బోటులో పనిచేస్తున్న సిబ్బంది పోర్ట్ అధికారులకు సమాచారం అందజేయగా వెంటనే స్పందించి ప్రమాదానికి గురైన బోటులో ఉన్న ఐదు మంది సిబ్బందిని పోర్టు అధికారులు సురక్షితంగా మరో బోటు లోకి తరలించి వారి ప్రాణాలు కాపాడారు.