కొవ్వొత్తిని ఆర్పేసే ఆటోమేటిక్ డివైజ్‌ ఎప్పుడైనా చూశారా..

సాధారణంగా వెలిగించిన కొవ్వొత్తిని( Candle ) ఎవరూ చూడకుండా వదిలేస్తే అది అగ్ని ప్రమాదాలకు దారి తీసే ప్రమాదం ఉంది.

ఈ ప్రమాదాలను నివారించేందుకు వందేళ్ల కంటే ఎక్కువ కాలం క్రితమే ఒక పరిష్కారం కనుగొన్నారు.

దానిని ఆటోమేటిక్ క్యాండిల్ ఎక్స్‌టింగ్విషర్‌ అంటారు.ఈ డివైజ్ కొవ్వొత్తి మంటను దానికదే ఆర్పేయగలదు.

వెలిగించిన కొవ్వెత్తికి దీనిని అటాచ్ చేస్తే సరిపోతుంది.కొంచెం కాలినాక, సగం కాలిన తర్వాత లేదా దాదాపు పూర్తిగా కాలిన తర్వాత కొవ్వొత్తి ఆరిపోయేలా దీనిని సెట్ చేసుకోవచ్చు.

ఇది ఎలా పని చేస్తుందో చూపించే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారింది.దీనిని @ScienceGuys_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

Advertisement

షేర్ చేసిన కొద్ది గంటల్లోనే దీనికి 28 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ పరికరం భద్రత కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.వైరల్‌ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు వెలిగించిన ఒక కొవ్వొత్తి, దానికి అటాచ్ చేసిన ఒక ఆటోమేటిక్ క్యాండిల్ ఎక్స్‌టింగ్విషర్‌ కనిపిస్తుంది.

కొవ్వొత్తి కొంత కాలిన తర్వాత ఆ పరికరం పైభాగం వేగంగా మూసుకుపోతుంది.అలాగే మంటను ఆర్పేస్తుంది.ఇది ఒక స్ప్రింగ్ లాగా పని చేస్తుంది.

ఆ స్ప్రింగ్ అనేది కొవ్వొత్తి ఒక ప్లేస్ దాక కరిగిపోయాక పనిచేయడం వల్ల ఈ డివైజ్‌ పైభాగం క్లోజ్ అవుతుంది.ఆ విధంగా ఫైర్ ఆర్పేయడం జరుగుతుంది.

మంటను ఎప్పుడు ఆపాలో దీనిని అమర్చే హైట్ పై ఆధారపడి ఉంటుంది.కొవ్వొత్తులను ఇష్టపడే వ్యక్తులు అగ్ని గురించి చింతించకుండా వాటిని ఆస్వాదించడానికి ఆటోమేటిక్ క్యాండిల్ ఎక్స్‌టింగ్విషర్‌ను ఉపయోగించవచ్చు.కొవ్వొత్తులు ఒక స్థలాన్ని చక్కగా, మంచి వాసన కలిగిస్తాయి, కానీ వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే ప్రమాదకరమైనవి కూడా కావచ్చు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !

ప్రజలు కొవ్వొత్తులను ఉపయోగించినప్పుడు మరింత రిలాక్స్‌గా, సురక్షితంగా అనుభూతి చెందడానికి ఆటోమేటిక్ క్యాండిల్( Automatic candle ) ఎక్స్‌టింగ్విషర్‌ టూల్ సహాయపడుతుందిమతపరమైన లేదా సాంస్కృతిక కారణాల కోసం లేదా ప్రత్యేక కార్యక్రమాల కోసం కొవ్వొత్తులను ఉపయోగించే ప్రదేశాలలో కూడా ఇది సహాయకరంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు