ఈ బామ్మ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. !

వయస్సు పెరిగినా కొద్దీ మనిషిలో సత్తువ తగ్గి నీరసించి పోతారు.కొందరికి అయితే చూపు మందగించి ఇంటికే పరిమితమవుతారు.

 Hatsoff To This Grandma For The Work She Did.,71 Yeras, Old Women, 11 Vehicle, L-TeluguStop.com

కానీ ఈ బామ్మ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.ఏడు పదుల వయస్సులోనూ రకరకాల వాహనాల లైసెన్స్ లు పొందుతూ.

అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.కారెల్ కొచ్చిలోని తోప్పుంపాడికి చెందిన రాధామణి కి డ్రైవింగ్ అంటే చాలా ఆసక్తి.

తన 30 ఏళ్ల వయస్సులో మొదటిసారి ఆమె డ్రైవింగ్ ప్రారంభించింది.

ఆమెకు డ్రైవింగ్‌పై ఉన్న ఆసక్తిని గుర్తించిన భర్త త్విలాల్.

ఆమెకు వాహనాలను నడపడం నేర్పించాడు.దీంతో అప్పటి నుండి ఇప్పటివరకు ఆమె బస్సు, లారీ, క్రేన్, ట్రైలర్, ఫోర్క్ లిఫ్ట్, రోడ్ రోలర్, జేసీబీ వంటి 11 రకాల వాహనాలను ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుంది.రాధామణి భర్త త్విలాల్.1978లో డ్రైవింగ్ స్కూల్‌ని ప్రారంభించాడు.డ్రైవింగ్ తో పాటు రాధామణి ఎర్నాకులం జిల్లాలోని కలంసేరి పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సును కూడా అభ్యసిస్తోంది.దీనికి కూడా ఒక కారణం ఉంది.టవర్ క్రేన్‌ను ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోవడానికే ఈ కోర్స్ చేస్తున్నట్లు ఆమె తన ఆసక్తిని వ్యక్తపరిచింది.

రాధామణి భర్త త్విలాల్.2004లో చనిపోవడంతో.కుటుంబ పోషణ కోసం డ్రైవింగ్ స్కూల్ బాధ్యతలను తానే కొనసాగిస్తుంది.

ఆ సమయంలో ఓ మహిళ హెవీ వెహికిల్ నడుపుతున్న తీరును చూసి జనాలు షాక్ అయ్యారు. 70 ఏళ్ల వయస్సులోనూ ఆమె పట్టుదలను చూసి పలువురు ఆమెను మెచ్చుకుంటున్నారు.

కాగా, కేరళలలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా రాధామణి గుర్తింపు పొందింది.ఇంత వయసులో 11 రకాల వెహికిల్ లైసెన్స్ పొందిన ఏకైక మహిళగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇందుకు కారణం తన భర్తే అని గర్వంగా చెబుతోంది రాధామణి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube