ఎద్దుకోసం ఈ రైతు చేసిన ప‌నికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

వ్య‌వ‌సాయంలో రైతుకు స్నేహితుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే త‌న పాడి ప‌శువులు మాత్ర‌మే.వ్య‌వ‌సాయంలో ఎద్దులు లేకుండా ఏ ప‌నీ చేయ‌లేము.

అందుకే వీటిని రైత‌లు ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు.వీటికోసం నిత్యం జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే ఉంటారు.

ఎందుకంటే ప్ర‌తి వ్య‌క్తి త‌న జీవితంలో ఎవరివళ్ల మ‌నం పైకి వ‌స్తామో వారిని మాత్రం అస్స‌లు మ‌ర్చిపోకూడదు.వారిప‌ట్ల ఎప్ప‌టికీ కృతజ్ఞత భావంతోనే ఉండాలి.

కాగా రైతులు కూడా త‌మ‌కు ఎలాంటి లాభ‌పేక్ష లేకుండా వ్య‌వ‌సాయంలో వెన్ను ద‌న్నుగా నిల‌స్తున్న ఎద్దుల‌ను ఓ రైతు ఎలా చూసుకుంటున్నాడో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.నిజానికి జంతువుల మీద మ‌నుషుల‌కు చాలానే ప్రేమ ఉంటుంది.

Advertisement

కానీ రైతుల విష‌యానికి వ‌స్తే మాత్రం ప్ర‌తి రైతుల‌కు త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే ఆవులు లేదా ఎద్దుల మీద అంత ప్రేమ క‌చ్చితంగా ఉంటుంది.అందుకు సాక్షంగా నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ పిక్‌ను చూస్తేనే అర్థం అయిపోతుంది.

ఓ రైతు నిత్యం త‌న వ్య‌వ‌సాయ ప‌నులకు ఓ ఎద్దును ఉప‌యోగిస్తున్నాడు.అంతేకాదు ఎద్దుల బండికి కూడా ఈ ఒక్క ఎద్దునే ఉప‌యోగిస్తున్నాడు.

నిత్యం ఎక్క‌డ‌కు వెళ్లినా లేదంటే ఏమైనా సరుకుల రవాణా చేయాల‌నుకున్నా స‌రే దీన్నే వాడుతున్నాడు.

అయితే ఎండ‌కు వెళ్లిన‌ప్పుడు ఈ ఎద్దుల బండిని లాగుతున్న ఎద్దుకు ఇబ్బంది కలుగుతుందని భావించాడు ఆ రైతు.ఎలాగైనా ఎద్దుకు ఎండ త‌గ‌ల‌కుండా చూడాల‌ని ఓ వినూత్న ఆలోచన వ‌చ్చింది ఆయ‌న‌కు.వెంట‌నే ఆ ఎద్దుల బండి ద‌గ్గ‌ర‌కు వెళ్లి దానికి నాలుగు దిక్కులా నాలుగు కర్రలతో ఓ మంచె మాదిరిగా ఎద్దు మీద ఎండ పడకుండా నీడ వ‌చ్చే విధంగా ఏర్పాట్లు చేసేశాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఇంకేముంది ఎంత ఎండ‌లో అయినా ఆ ఎద్దు ఎంచక్కా నీడ‌లోనే ఉంటోంది.ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అయిపోతోంది.

Advertisement

తాజా వార్తలు