కే‌సి‌ఆర్ లో సడన్ మార్పు.. భయమా ? వ్యూహమా ?

తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్( CM KCR ) టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.వాడి వేడి విమర్శలతో ప్రత్యర్థి పార్టీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటారు.

 Has There Been A Change In Kcr,cm Kcr , Brs , Ts Politics, Narendra Modi, Bjp, C-TeluguStop.com

మీడియా సమావేశాల్లో అయిన బహిరంగ సభల్లోనైనా తనదైన రీతిలో విమర్శల దాడి చేస్తుంటారు కే‌సి‌ఆర్.గత కొన్నాళ్లుగా బీజేపీ నేతలపై, మోడీ పాలన( Narendra Modi )పై ఆయన ఏ స్థాయిలో ఫైర్ అవుతూ వచ్చారో తెలిసిందే.

మోడీది దౌర్భాగ్య పాలన అని, నియంత పాలన అని, మోడీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని ఇలా ఎన్నో రకాల విమర్శలతో కే‌సి‌ఆర్ బీజేపీ పై విరుచుకు పడిన రోజులు అనేకం.

Telugu Cm Kcr, Congress, Mlc Kavitha, Narendra Modi, Telangana-Politics

ఏ బహిరంగ సభలలోనైనా బీజేపీని మోడీ పాలనను తిట్టకుండా కే‌సి‌ఆర్ ప్రసంగం ముగింపుకు రాదు.అలాంటిది ప్రస్తుతం కే‌సి‌ఆర్ బీజేపీ ఊసే లేకుండా ప్రసంగం ముగించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా కే‌సి‌ఆర్ చేసిన వ్యాఖ్యలలో బీజేపీ గురించి గాని మోడీ సర్కార్ గురించి గాని అసలు ప్రస్తావనే లేదు.

కే‌సి‌ఆర్ ఇలా బీజేపీ విషయంలో సైలెంట్ అవ్వడం వెనుక చాలా పెదకథ ఉందనేది కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా మాట.ప్రస్తుతం డిల్లీ లిక్కర్ స్కామ్ లో కే‌సి‌ఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితా ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ సందర్భంలో మోడీ సర్కార్ తో కయ్యానికి కాలు దువ్వితే కే‌సి‌ఆర్ చిక్కుల్లో పెడే అవకాశం ఉంది.

Telugu Cm Kcr, Congress, Mlc Kavitha, Narendra Modi, Telangana-Politics

అందుకే ఆ భయంతోనే కే‌సి‌ఆర్ బీజేపీ( BJP ) ప్రస్తావనను తీసుకురావడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.లిక్కర్ స్కామ్ లో కూడా కవితా పై ఆ మద్య హడావిడి చేసిన ఈడీ ఇప్పుడు సైలెంట్ అయింది.దీని వెనుక బీజేపీ కే‌సి‌ఆర్ కు మద్య ఒప్పందం కుదిరిందనేది కాంగ్రెస్ చెబుతున్నా మాట.ఇదిలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని పార్టీ నేతలు చెబుతున్నారు.అందువల్ల అనవసరంగా బీజేపీని పదే పదే టార్గెట్ చేస్తే అదే భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉందని, అసలు బీజేపీ బి‌ఆర్‌ఎస్ కు పోటీనే కాదని చెప్పే ఉద్దేశ్యంతోనే వ్యూహాత్మకంగా బీజేపీని కే‌సి‌ఆర్ ప్రస్తావించడం లేదనేది మరికొందరి మాట.మొత్తానికి తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ బీజేపీ విషయంలో సైలెంట్ అయ్యారనేది మాత్రం వాస్తవమని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube