తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )పార్టీలో అంతర్గత విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టినది మొదలుకొని సీనియర్స్ వర్సస్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కొనసాగుతూ వచ్చింది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి ఇలా సీనియర్ నేతలంతా ఒకవైపు రేవంత్ రెడ్డి మరోవైపు.ఇలా వీరి మద్య కొనసాగిన వివాదం అంతా ఇంతా కాదు.
హస్తం హైకమాండ్ కూడా ఎన్నోమార్లు వీరిని కలిపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏ మాత్రం ఫలితం లేకపోయింది.నేతల మద్య జరుగుతున్నా కోల్డ్ వార్ కారణంగా పార్టీ కూడా బలహీన పడుతూవచ్చింది.

దీంతో కాంగ్రెస్ లో తిరిగి పుంజుకోవడం కష్టమే అని భావించరంతా.అయితే హస్తం పార్టీలో తాజా పరిణామాలను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.తాజాగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరుద్యోగ ర్యాలీలో రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ), కలిసి అందరినీ ఆశ్చర్య పరిచారు.కేవలం నామమాత్రంగా కలవడమే కాకుండా తమ మద్య ఎలాంటి విభేదాలు లేవని ఘంటాపథంగా చెప్పారు.
దీంతో కాంగ్రెస్ నేతల్లో నయా జోష్ నెలకొంది.ఎప్పుడు ఉప్పు నిప్పు లాగా ఉండే రేవంత్ రెడ్డి మరియు సీనియర్స్ కలవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.
అయితే ఇప్పుడేందుకు వీళ్ళు ఒక్కటయ్యారు ? వీళ్ళను కలిపిందేవరు అనే డౌట్ తెరపైకి వస్తోంది.

అయితే అటు సీనియర్స్ కు ఇటు రేవంత్ రెడ్డికి మద్య వారధిలా జానారెడ్డి( Janareddy ) ఉన్నట్లు తెలుస్తోంది.జానారెడ్డి చొరవతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.రేవంత్ రెడ్డితో కలిసేందుకు ముందుకు వచ్చినట్లు పోలిటికల్ సర్కిల్స్ వినికిడి.
ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే సమయం ఉండడంతో ఇప్పుడు కూడా కలిసి నడవకపోతే కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే ఛాన్స్ ఉంది.

సీనియర్స్ మరియు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మద్య ఉన్న విభేదాల కారణంగా చాలమంది నేతలు పార్టీని విడుస్తున్న పరిస్థితి.దాంతో విభేదాలను పక్కన పెట్టి పార్టీకి పునర్జీవం పోసేందుకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిఉంటే కలదు సుఖం అనే నినాదాన్ని ఎత్తుకున్నట్లు తెలుస్తోంది.మరి వీరి కలయిక ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి.







