పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అనే చెప్పాలి…ఇక పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నాడు… ఇక గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఓవైపు సినిమా షూటింగ్స్ చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గురించి తరచు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది.
ఇక తాజాగా ఈయన గురించి మరో సంచలన వార్త వినిపిస్తోంది.అదేంటంటే పవన్ కళ్యాణ్ మూడో భార్య కు కూడా విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ నెట్టింట ఒక వార్త చెక్కర్లు కొడుతుంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే .ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు…
అందులో ఇద్దరికీ విడాకులు ఇచ్చేసారు.మూడో భార్య తో ఉంటున్నారు.అయితే ఈ మధ్యకాలంలో మూడో భార్య కూడా పవన్ కళ్యాణ్ తో ఉండడం లేదు.ఆమె తన పిల్లలతో కలిసి సింగపూర్ లో ఉంటున్నట్టు సమాచారం.అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్లో కూడా అన్నా లెజ్నోవా( Anna Lezhneva ) పాల్గొనక పోవడంతో నిజంగానే పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా ని దూరం పెట్టాడు అంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి…
![Telugu Anna Lezhneva, Chiranjeevi, Pawan Kalyan, Pawankalyan, Venu Swamy-Movie Telugu Anna Lezhneva, Chiranjeevi, Pawan Kalyan, Pawankalyan, Venu Swamy-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/07/Has-Pawan-Kalyan-and-his-third-wife-Anna-Lezhneva-decided-to-part-ways-detailsd.jpg)
ఇక ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ లో జరిగిన వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి( Varun Tej Engagement ) కూడా పవన్ కళ్యాణ్ ఒంటరిగా హాజరయ్యారు.అంతేకాకుండా రామ్ చరణ్ కి కూతురు పుట్టిన కూడా చూడడానికి రాలేదు ఇక చిరంజీవి ఫ్యామిలీలో జరిగిన బారసాల ఫంక్షన్ కి కూడా అన్నా లెజ్నోవా పాల్గొనక పోవడంతో నిజంగానే పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా ని దూరం పెట్టాడు ఈమెకు కూడా విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ నెట్టింట ప్రచారం జోరుగా వినిపిస్తోంది…
![Telugu Anna Lezhneva, Chiranjeevi, Pawan Kalyan, Pawankalyan, Venu Swamy-Movie Telugu Anna Lezhneva, Chiranjeevi, Pawan Kalyan, Pawankalyan, Venu Swamy-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/07/Has-Pawan-Kalyan-and-his-third-wife-Anna-Lezhneva-decided-to-part-ways-detailsa.jpg)
ఇక వీరి విడాకుల వార్తలు రావడానికి మరొక కారణం ఏమిటంటే.అన్నా లెజ్నోవా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రాజకీయ వ్యవహారాల్లో ఎక్కడికి వెళ్లినా కూడా ఆమె దిష్టి తీసి బొట్టు పెట్టి పంపించేది.ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాల పనిమీద ఎక్కడికైనా వెళ్లినప్పుడు అన్నా ఎదురుగా వచ్చి ఆయనకు దిష్టి తీసి మరి పంపించేది.అలాంటిది ఇప్పుడు ఆయన వారాహి యాత్ర చేస్తున్నప్పుడు కూడా అన్న లేజ్నోవా పాల్గొనలేదు.
గత కొద్ది రోజులుగా అసలు ఇండియాలోనే అన్న లేజ్నోవా కనిపించక పోవడంతో వేణు స్వామి చెప్పినట్లు పవన్ కళ్యాణ్ మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చి నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు కావచ్చు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి…