కోమటిరెడ్డిలో మార్పు.. అయినా డౌటే ?

Has Komatireddy Venkatareddy's Behavior Changed , Komatireddy Venkatareddy, Congress, Telangana Politics, TPCC Chief Revanth Reddy, Munugodu

తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకట రెడ్డి( Komati Reddy Venkata Reddy ) వ్యవహారం ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే ఉంటుంది.పార్టీలో సీనియర్ నేతగా ఉన్నప్పటికి గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి.

 Has Komatireddy Venkatareddy's Behavior Changed , Komatireddy Venkatareddy, Cong-TeluguStop.com

పార్టీ కార్యకలాపాలకు అంటి అంతనట్టుగా ఉండడం, పరోక్షంగా పార్టీని దెబ్బ తీసేలా వ్యాఖ్యానించడం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై( TPCC Chief Revanth Reddy ) తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటివి చేస్తూ వచ్చారు.దీంతో ఆయన కాంగ్రెస్ వీడే అవకాశాలు ఉన్నాయని గట్టిగానే వార్తలు వినిపించాయి.

అయితే కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని చాలాసార్లు ఆయన స్పష్టం చేసినప్పటికీ.ఆయన వ్యవహారం చూస్తే వ్యతిరేకంగానే కనిపిస్తూ వచ్చాయి.

Telugu Congress, Congressmp, Munugodu, Telangana-Politics

ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక( munugodu ) సమయంలో ఈయన చుట్టూ జరిగిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు.కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ ఓటమిని కోరుకున్నారని సొంత పార్టీ నేతలే ఈయనపై నిప్పులు చెరుగుతూ విమర్శలు గుప్పించారు.ఈయన కూడా కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదనే విధంగా వ్యాఖ్యలు చేసి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు.మరి ఈ స్థాయిలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

ప్రస్తుతం ఆయన వైఖరిలో చాలానే మార్పు కనిపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు తిరుగులేదని తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని కుండబద్దలు కొడుతున్నారు.

ఏకంగా కాంగ్రెస్ కు 70-80 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Telugu Congress, Congressmp, Munugodu, Telangana-Politics

మరి ఇంత సడన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో మార్పు ఎందుకొచ్చినట్టు అనే చర్చ జరుగుతోంది.దీనికి ప్రధాన కారణం కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడమే అనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.ఆ రాష్ట్ర గెలుపుతో టి కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.అందాలు కలిసి ముందుకు సాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ముఖ్యంగా పార్టీకి సీనియర్ నేత గా ఉన్న కోమటిరెడ్డిలో ఈ రకమైన మార్పు రావడం పార్టీకి కలిసొచ్చే అంశామని ఇతర కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రాబోయే రోజుల్లో కూడా కోమటిరెడ్డి ఇదే సానుకూల దృక్పథంతో ఉంటారా లేదా మళ్ళీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారా అనే డౌట్ కూడా కొందరి నేతల్లో ఉంది.మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూల తీరు కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనే చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube