కేశినేని నాని ఇలా డిసైడ్ అయిపోయారా ? 

విజయవాడ టిడిపి ఎంపీ నాని( TDP MP Nani ) వ్యవహారం గత కొంతకాలంగా చర్చనీయాంశంగానే మారింది.సొంత పార్టీలో ఆయనకు అసమ్మతి గళం పెరగడం, కేశినేని నాని సోదరుడు చిన్నిని తెరపైకు తీసుకురావడం, వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇవ్వబోతున్నామనే సంకేతాలు టిడిపి అగ్రనాయకత్వం ఇస్తూ ఉండడం, తదితర పరిణామాలతో చాలా కాలంగా నాని అసంతృప్తితోనే ఉంటున్నారు.

 Has Keshineni Nani Decided Like This, Kesineni Nani, Kesineni Chinni, Ap Governm-TeluguStop.com

సొంత పార్టీపై విమర్శలు చేస్తూ, వైసిపి ఎమ్మెల్యేలతో సన్నిహితంగా మెలుగుతూ, వైసిపి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వారితో కలిసి భాగస్వామ్యం అవుతుండడం, ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యేలను పొగడ్తలతో ముంచేత్తడం వంటివన్నీ టీడీపీకి ( TDP )ఇబ్బందికరంగా మారాయి.ఇవన్నీ పరిగణలోకి తీసుకునే నానిని పక్కనపెట్టి కేసునేని చిన్నిని తెరపైకి టిడిపి అధిష్టానం తీసుకొచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

కొద్ది రోజుల క్రితం వైసీపీ నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు( Jagan Mohan Rao ), తాజాగా వైసిపి నందిగామ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్( Vasantha Krishna Prasad ) తో కలిసి నాని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యేలను నాని పొగడడంపై టీడీపీ హై కమాండ్ తీవ్రంగా ఈ వ్యవహారాన్ని తీసుకుంది.వైసిపి రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి నాని గురించి ప్రస్తావిస్తూ, నాని మంచి వ్యక్తి అని, ఆయన వైసీపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారింది.

2014-19 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయవాడ ( Vijayawada )నుంచి ఎంపీగా గెలుపొందిన నాని వచ్చే ఎన్నికల్లో టిడిపి ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా, తనకు అభ్యంతరం లేదని, తాను మాత్రం ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నానని, తాను చేసిన అభివృద్ధి మళ్ళీ తనను గెలిపిస్తుంది అంటూ నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యాఖ్యలపై టిడిపి అధిష్టానం తనపై ఎటువంటి చర్యలు తీసుకున్నా, తాను పట్టించుకోనని, అభివృద్ధి విషయంలో తనకు ఆ పార్టీ, ఈ పార్టీ అని సంబంధం లేదని, ఎవరితోనైనా కలిసి పనిచేస్తానని, తన మనస్తత్వానికి సరిపోతుంది అనుకుంటే ఏ పార్టీ అయినా l ఇబ్బంది లేదు అంటూ నాని వ్యాఖ్యానించారు.

దీంతో ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది.

Telugu Ap, Kesineni Chinni, Kesineni Nani, Mailavaram Mla, Telugudesam-Politics

ఇటీవల నందిగామ నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నాని వైసిపి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ను ప్రశంసించారు.మొండితోక బ్రదర్స్ మంచి వ్యక్తులని కొనియాడారు.ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆహ్వానం మేరకు ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నాని, అభివృద్ధి ,రాజకీయాలు వేరు వేరు అంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ వ్యాకరించారు.

Telugu Ap, Kesineni Chinni, Kesineni Nani, Mailavaram Mla, Telugudesam-Politics

తాజాగా నాని చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు టిడిపికి ఇబ్బందికరంగా మారాయి.ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే విషయం పైన అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట.ప్రస్తుతానికి టిడిపిలో కొనసాగినా, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడం, తనను పదే పదే వైసిపి లో చేరాలంటూ ఆహ్వానిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల సమయం నాటికి వైసీపీలో చేరే విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నాని ఉన్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube