మాస్ మహారాజ్ రవితేజ ఎన్నో కష్టాలు పడి హీరో అయ్యారనే సంగతి తెలిసిందే.తన గురించి సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను సైతం పవన్ కళ్యాణ్ అస్సలు పట్టించుకోరని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.
ధమాకా సినిమాతో కూడా రవితేజ ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్టే అని కామెంట్లు వినిపించినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ప్రదర్శితం అవుతోంది.ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది.
రవితేజ ఈ సినిమాతో క్రాక్ సినిమాను మించి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.ధమాకా సక్సెస్ తో రవితేజతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్న దర్శకనిర్మాతల సంఖ్య మరింత పెరుగుతోంది.
తాజాగా ధమాకా మూవీ సక్సెస్ మీట్ జరగగా ఈ ఈవెంట్ లో హరీష్ శంకర్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.హరీష్ శంకర్ రవితేజ కాళ్లకు మొక్కి నమస్కారం చేయడంతో పాటు కీలక వ్యాఖ్యలు చేశారు.
రవితేజపై ఉన్న గౌరవం, ప్రేమను చెప్పాలనే ఆలోచనతోనే దండం పెట్టానని హరీష్ శంకర్ కామెంట్ చేశారు.నేను సినిమా రంగంలో ఏక వచనంతో పిలిచే ఏకైక వ్యక్తి రవితేజ అని హరీశ్ శంకర్ పేర్కొన్నారు.
రవితేజ గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు ధమాకా సినిమాతో రవితేజ చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారని హరీష్ శంకర్ అన్నారు.హరీష్ శంకర్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రవితేజ హరీష్ శంకర్ కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాలి.మరోవైపు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.