తెలంగాణలో రైతుల బలవన్మరణాల వ్యవహారంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
రైతుల బలవన్మరణాలపై ‘పొలంబాట’ నిర్వహించిన మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.దీంతో కేసీఆర్( KCR ) వ్యాఖ్యలకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కౌంటర్ ఇచ్చారు.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల వివరాలను సీఎంకు పంపారు.
ఈ మేరకు సుమారు 209 మంది పేర్లతో హరీశ్ రావు లేఖను విడుదల చేశారు.బ్యాంకుల ఒత్తిళ్లు, వేధింపుల వలనే రైతులు బలవన్మరణం చెందారని ఆయన ఆరోపించారు.