మహాత్మాగాంధీ భార్య కస్తూరిబాయి బయోపిక్ లో పిల్ల జమిందార్ పిల్ల

ఇండియన్ హిస్టరీ చదువుకుంటే కచ్చితంగా మహాత్మాగాంధీకి ఒక అధ్యాయం ఉంటుంది.ఆయన లేకుండా భారతదేశ చరిత్ర ఎవరూ చెప్పలేరు.

ఆయన సుదీర్ఘ స్వాతంత్ర్య ప్రస్తానం భారతావనిలో ప్రతి ఒక్క భారతీయుడు కచ్చితంగా గుర్తు చేసుకుంటాడు.అయితే ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనేది నానుడి.

ఒక మగాడు సమాజానికి ఉపయోగపడే గొప్ప పనులు చేయాలంటే అందులో భార్యస్థానంలో ఉన్న ఆడవాళ్ళ ప్రోత్సాహం కచ్చితంగా ఉండి తీరుతుంది.అలాగే మహాత్మాగాంధీ జీవితంలో కూడా కస్తూరిబాయి గాంధీ ఉంది.

గాంధీ చరిత్రలో ఆమె ప్రస్తావన తక్కువగానే ఉన్నా కూడా ఆమె భాగస్వామ్యం లేకుండా గాంధీజీ ప్రయాణం సాగలేదనే చెప్పాలి.అలాంటి కస్తూరిబాయి జీవితానికి ఇప్పుడు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నం కన్నడ ఇండస్ట్రీలో చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం బయోపిక్ లకి కొంత వరకు ఆదరణ వస్తూ ఉండటంతో కన్నడనాట ఆమె బయోపిక్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.బరగురు రామచంద్రప్ప దర్శకత్వంలో తాయి కస్తూర్‌ గాంధీ టైటిల్‌ ఖరారు చేశారు.

కథానాయిక తెలుగులో పిల్ల జమిందార్ సినిమాలో నటించిన హరిప్రియను ఎంపిక చేశారు.తాను రాసిన కస్తూర్బా వర్సెస్‌ గాంధీ పుస్తకం ఆధారంగా ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

త్వరలో గుజరాత్‌, ఇతర రియల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.హరిప్రియ మాట్లాడుతూ గాంధీకి సంబంధించిన చిత్రాల్లో కస్తూర్బా ప్రస్తావన ఉంది.

అయితే, ఆమె కోణం నుంచి ఎవరూ కథను చెప్పలేదు.మా చిత్రంలో పూర్తిగా ఆమె వైపు నుంచి కథ చెబుతున్నాం.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

గాంధీతో కస్తూర్బా అనుబంధం, కుటుంబ అంశాలు, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆమె పాత్ర వంటివి చూపించబోతున్నామని చెప్పుకొచ్చింది.ఈ సినిమాలో మూడు గెటప్స్ లో తన పాత్ర ఉండబోతుందని చెప్పింది.

Advertisement

ఇక ఈ సినిమాలో గాంధీజీ పాత్రలో ఎవరిని చూపించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు