పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమయ్యి చాలా కాలం అయింది.కరోనా మరియు జనసేన కార్యక్రమాల కారణంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ని పూర్తి చేయడంలో విఫలం అవుతున్నారు.
అదిగో ఇదిగా అంటూ షెడ్యూల్ క్యాన్సిల్ అవుతూ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.ఇటీవల పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు అంతా పాల్గొన్న ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ జరిగింది.
ఆ వర్క్ షాప్ లో తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన విషయాలను చర్చించడం జరిగింది.
అక్టోబర్ రెండో వారం లేదా మూడో వారం లో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభం అవ్వాల్సి ఉంది, కానీ పవన్ కళ్యాణ్ జనసేన కార్యక్రమాలతో బిజీ గా ఉండడం వల్ల ఇప్పటి వరకు హరిహర వీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాలేదు అంటూ సమాచారం అందుతుంది.
దర్శకుడు క్రిష్ ఇప్పటికే అనుకున్న షెడ్యూల్ రద్దు చేయడంతో పాటు పలువురు నటీనటుల నుండి తీసుకున్న డేట్ లను కూడా వెనక్కు ఇచ్చేసాడని తెలుస్తోంది.పాపం క్రిష్ పదే పదే ప్లాన్ చేయడం పవన్ కళ్యాణ్ జనసేన కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమా ను విడుదల చేయాలని దర్శకుడు క్రిష్ భావించాడు.మరి ఆ డేట్ కి సినిమా వచ్చేలా పవన్ కళ్యాణ్ నుండి సహకారం క్రిష్ కి అందుతుందా లేదా అనేది అనుమానమే అంటూ కొందరు ఇండస్ట్రీ కి చెందిన వారు కామెంట్స్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ డేట్ లు అయితే ఇస్తున్నాడు.కానీ ఆ డేట్ల లో షూటింగ్ కి రాలేక పోతున్నాడు.జనసేన కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉంటున్నాడు అంటూ సినిమా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.







