ఈషా రెబ్బా హీరోయిన్ అవ్వడం వెనక ఇంత కథ ఉందా ?

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్ల హవా చాలా తక్కువగానే ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే.అలాంటి తెలుగు హీరోయిన్లలో ఒకరు ఈషా రెబ్బా.

 Story Behind Eesha Rebba Movie Entry Eesha Rebba, Tollywood, Indraganti , Pawan-TeluguStop.com

హసన్ పర్తి లో పుట్టిన ఈషా రెబ్బా తన తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది.ఈషా కి ఇద్దరు ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు.

బిహెచ్ఇఎల్ లో తండ్రి ఉద్యోగం చేయడంతో అక్కడే ఉండే వాళ్ళు.ఇక సెయింట్ ఆన్స్ స్కూల్లో పదో తరగతి వరకు చదివింది.

ఆ తర్వాత ఇంటర్ బైపిసి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో చేసింది.బిఎస్సి లో మైక్రో బయాలజీ చదివిన ఈషా రెబ్బా మల్లారెడ్డి కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది.

తాను ఉంటున్న ఏరియా నుంచి స్కూల్ కి, కాలేజీ కి వెళ్ళొస్తున్న సమయంలో బస్ స్టాప్ దగ్గర ఎప్పుడూ గోడ పైన ఎప్పుడు సినిమా పోస్టర్స్ అంటించి ఉండేవి.అవి ఈశాని అమితంగా ఆకట్టుకునేవి.

ప్రతి వారం అక్కడ మారే పోస్టర్లను చూస్తూ ఉండేది ఈశా.అందుకే ఆమెకు సినిమా ఇండస్ట్రీ అంటే ఆకర్షణ మొదలైంది.ఇక కాలేజీలో ప్రాజెక్ట్ కారణంగా ఎక్కువగా జూబ్లీహిల్స్ లోని ఒక టీవీ ఛానల్ లోకి వెళ్లాల్సి వచ్చింది.దాంతో అక్కడ కొంతమంది ఆమెని యాంకర్ గా ట్రై చేయమని సజెస్ట్ చేశారు.

వారి మాటలతో ప్రోత్సాహం పొందిన ఈషా యాంకరింగ్ లోకి అడుగుపెట్టింది.కానీ చిన్నతనం నుంచి ఇంగ్లీష్ మీడియం కావడంతో యాంకరింగ్ పై పట్టు లేక టెలి ప్రంప్టార్ పై వచ్చే తెలుగుని గడగడా చదవడం ఇబ్బంది అవడంతో తనకు ఆ ఫీల్డ్ సూట్ కాదని వదిలేసింది.

Telugu Eesha Rebba, Indraganti, Jubilee Hills, Kushi, Pawan Kalyan, Tollywood-La

పవన్ కళ్యాణ్ అంటే ఈషాకు ఆమెకు ఎంతో ఇష్టం కావడంతో ఓ రోజు ఖుషి సినిమా పోస్టర్ ను చూసిన ఈషా ఎప్పటికైనా అతనితో నటించాలని బలంగా కోరుకుంది.అలా తొలుత మోడలింగ్ లో అడుగు పెట్టింది.ఆ తర్వాత కొన్ని ప్రకటనలకు మాడల్ గా పనిచేసింది.దాంతో ఈషాకు కొంత కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది.ఆ తర్వాత ఓ రోజు ఆమెకి ఇంద్రగంటి ఆఫీస్ నుంచి ఆడిషన్ కి రమ్మని ఫోన్ వచ్చింది.ఆ సినిమాలో హీరో నితిన్ కాగా హీరోయిన్ కోసం ఈషా ఆడిషన్ ఇచ్చింది.

కానీ అవతల వైపు నుంచి కొన్ని రోజుల పాటు ఎలాంటి సమాధానం రాలేదు.ఆ సినిమా పేరు కొరియర్ బాయ్ కళ్యాణ్.

ఆ తర్వాత ఇంద్రగంటి ఆఫీస్ నుంచి ఫోన్ రావడం, ఈషా దెబ్బ ఆడిషన్ కి వెళ్లి సెలెక్ట్ కావడం జరిగిపోయాయి.ఇంద్రగంటి ఆ తర్వాత తన అమీతుమీ, సినిమాలోను, బందిపోటు సినిమాలోను ఈశాకి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు.

ఇక బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘవ, రాగల 24 గంటల్లో, సుబ్రహ్మణ్యం పురం వంటి సినిమాలో ఈషా మంచి క్యారెక్టర్స్ చేసింది.కానీ ఎందుకో ఆమె ఇప్పటికీ కూడా స్టార్ హీరోయిన్ గా ఎదగడంలో విఫలం అయింది అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube