వీరమల్లు శాటిలైట్ డీలింగ్ పై వివాదం.. పవన్ వద్దకు వెళ్లిన గొడవ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత ఇటీవలే పవన్ భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.ప్రస్తుతం పవన్ వరుస సినిమాలను లైన్లో పెడుతూ స్పీడ్ పెంచేస్తున్నాడు.

ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరి హర వీరమల్లు సినిమా ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ ఇప్పటి వరకు జరగలేదు.

పవన్ భీమ్లా నాయక్ సినిమా తర్వాత షూటింగ్ కు గ్యాప్ ఇచ్చాడు.అయితే పవన్ మళ్ళీ శ్రీరామ నవమి పండుగ సందర్భంగా హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసాడు.

ఈ షెడ్యూల్ శరవేగంగా జరగుతుంది.ఇంకా 40 శాతం షూటింగ్ మిగిలి ఉండడంతో జూన్ లేదా జులై లోపు ఈ సినిమా మొత్తాన్ని పూర్తి చేయాలనీ పవన్ భావిస్తున్నాడు.

అందుకే ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.అయితే ముందు నుండి ఈ సినిమాకు ఏదొక అడ్డంకి వస్తూనే ఉంది.

తాజాగా మరో అడ్డంకి వచ్చింది.ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఈ శాటిలైట్ హక్కులను చాలా కాలం క్రితమే ఎంఎం రత్నం విక్రయించాడు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

అప్పుడు పవన్ మార్కెట్ 8 కోట్ల వరకు మాత్రమే ఉంది.ఇప్పుడు ఈ లెక్క మూడు రేట్లు పెరిగింది.

దీంతో ఇప్పుడు శాటిలైట్ డీల్ గురించి చర్చలు జరుగు తున్నాయి.

అయితే దీనిని విక్రయించిన వారు మాత్రం ఈ చర్చలు జరపడానికి ఒప్పుకోవడం లేదు.ప్రెసెంట్ ఈ వివాదం పవన్ టేబుల్ మీదకు చేరుకుందట. మరి పవన్ ఈ వివాదాన్ని ఎలా సాల్వ్ చేస్తాడో వీచు చూడాల్సిందే.

తాజా వార్తలు