కెప్టెన్‌గా హార్దిక్‌... రోహిత్‌ అనారోగ్యమే కారణమా?

టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టైం ఈ మధ్య అస్సలేమీ బాగోలేదు. ఆసియా కప్ T20 టోర్నమెంట్ మొదలుకొని T20 ప్రపంచ కప్ తో పాటుగా బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో భారత జట్టు చవుకబారు ప్రదర్శన చూసి కెప్టెన్ రోహిత్ శర్మపై చర్యలకు BCCI ఉపక్రమించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 Hardik Pandya Likely To Be The Team India Captain In T20 Series With Srilanka De-TeluguStop.com

రోహిత్ శర్మను T20, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు పెద్దలు ఓ తుది నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు బయటకు పొక్కాయి.కాగా అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు పొట్టి ఫార్మాట్ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్టు కూడా వినికిడి.

ఈ నేపథ్యంలో జనవరి 3 నుంచి ముంబైలో ఆరంభం కాబోతున్న శ్రీలంకతో రాబోయే T20 సిరీస్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భారత్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ సిరీస్‌లో రెండు, మూడు మ్యాచ్‌లు జనవరి 5న పూణెలో, జనవరి 7న రాజ్‌కోట్‌లలో జరగనున్నాయనే విషయం అందరికీ తెలిసినదే.

కాగా ప్రస్తుతం రోహిత్ శర్మ బొటన వేలి గాయం తగ్గక పోవడంతో బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు దూరంగా ఉన్నాడు.అతని గాయం నయం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని భోగట్టా.

ఇక ఇదే అదనుగా అతనిని నాయకత్వం నుండి తప్పించే పనిలో వున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.కాగా అతను శ్రీలంకతో T20 సిరీస్ కు కూడా దూరంగా ఉండే అవకాశం మెండుగా ఉంది.ఈ నేపథ్యంలో ఈ సిరీస్ లో భారత జట్టును హార్దిక్ ముందుండి నడిపించనున్నాడు.అయితే రోహిత్ స్థానంలో హార్దిక్ ను పూర్తి స్థాయి T20 కెప్టెన్ చేసే విషయంలో ఇంకా చర్చలు నడుస్తుండటం గమనార్హం.

కొత్త సెలక్షన్ కమిటీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మార్పు ఉంటుందని తెలుస్తోంది.బుధవారం జరిగిన BCCI అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై చర్చించలేదని బోర్డు సభ్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube