అదనపు కట్నం కోసం ఎన్ఆర్ఐ భర్త వేధింపులు.. భార్య ధర్నా

హైదరాబాద్ యూసఫ్‎గూడలో భర్త ఇంటి ముందు బాధితురాలు ధర్నాకు దిగింది.అదనపు కట్నం కావాలంటూ తమ కుమార్తెను ఎన్ఆర్ఐ భర్త వేధించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

 Harassment Of Nri Husband For Extra Dowry.. Wife Dharna-TeluguStop.com

హిమాయత్ నగర్ దోమలగూడకు చెందిన రామేశ్వరికి, యూసఫ్ గూడకు చెందిన మహేశ్ తో గతేడాది మే 26న వివాహం జరిగింది.పెళ్లి సమయంలో రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారం పెళ్లి కొడుకుకు ఇచ్చారు.జూలైలో భార్యను అమెరికాలోని టెక్సాస్ కు తీసుకెళ్లిన మహేశ్ … తక్కువ కట్నం తెచ్చావంటూ వేధింపులకు గురి చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

కుటుంబ సభ్యుల సహాయంతో ఇండియాకు చేరుకున్న రామేశ్వరి అత్తవారంటి ముందు ఆందోళన చేపట్టింది.తనకు సరైన న్యాయం జరిగే వరకు పోరాడుతానని బాధితురాలు చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube