అదనపు కట్నం కోసం ఎన్ఆర్ఐ భర్త వేధింపులు.. భార్య ధర్నా
TeluguStop.com
హైదరాబాద్ యూసఫ్‌గూడలో భర్త ఇంటి ముందు బాధితురాలు ధర్నాకు దిగింది.అదనపు కట్నం కావాలంటూ తమ కుమార్తెను ఎన్ఆర్ఐ భర్త వేధించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
హిమాయత్ నగర్ దోమలగూడకు చెందిన రామేశ్వరికి, యూసఫ్ గూడకు చెందిన మహేశ్ తో గతేడాది మే 26న వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారం పెళ్లి కొడుకుకు ఇచ్చారు.
జూలైలో భార్యను అమెరికాలోని టెక్సాస్ కు తీసుకెళ్లిన మహేశ్ .తక్కువ కట్నం తెచ్చావంటూ వేధింపులకు గురి చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
కుటుంబ సభ్యుల సహాయంతో ఇండియాకు చేరుకున్న రామేశ్వరి అత్తవారంటి ముందు ఆందోళన చేపట్టింది.
తనకు సరైన న్యాయం జరిగే వరకు పోరాడుతానని బాధితురాలు చెబుతోంది.
హీరో అంటే ఇలా ఉండాలి.. కటింగ్ మధ్యలో ఆపేసి… ఏం చేశాడో చూడండి!