బుల్లి తెర పార్వతితో ఆది

‘హరహర మహాదేవ’ సీరియల్‌తో బుల్లి తెరపై ఇప్పటికే సందడి చేసిన సొనారిక తాజాగా ‘జాదూగాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి సినిమాతోనే ఈ అమ్మడు మంచి పేరు తెచ్చుకుంది.

 Tv Actress Sonarika To Romance Aadi-TeluguStop.com

అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకుని వరుసగా ఆఫర్లు తెచ్చుకుంటుంది.ఇప్పటికే ఈమెతో సినిమాలు చేయాలని నిర్మాతలు వెంట పడుతున్నారు.

‘జాదూగాడు’ విడుదలకు ముందే ఈమె బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.తాజాగా యువ హీరో ఆది సినిమాలో హీరోయిన్‌గా బుక్‌ అయ్యింది.

ఆది హీరోగా వీరభద్రం దర్శకత్వంలో ఇటీవలే మొదలైన సినిమాలో హీరోయిన్‌గా మొదట కొత్త అమ్మాయిని ఎంపిక చేశారు.అయితే ఆమెను తొలగించి తాజాగా సొనారికను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో ఉంది.

ఇదే నెల చివర్లో సెట్స్‌ పైకి వెళ్లేందుకు సిద్దంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube