నా ఫేవరెట్ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బర్త్ డే విషెస్ చెప్పిన సమంత!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న (మార్చి 27) తన 37 వ పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

 Happy Birthday Samantha To My Favorite Hero Samantha, Tollywood, Ram Charan, Bir-TeluguStop.com

ఈ సందర్భంగా చరణ్ కి సమంత కూడా తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక సమంత రామ్ చరణ్ కలిసి రంగస్థలం సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో వీరిద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఇకపోతే రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ఇప్పటి వరకు సమంత చూడలేదు.త్వరలోనే ఈ సినిమాని చూస్తానని ఈమె వెల్లడించారు.అదేవిధంగా రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.

చరణ్ నీ నటనకు అందరి నుంచి వస్తున్న ప్రశంసలు సూపర్బ్ నా ఫేవరెట్ రామ్‌చరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.అంటూ సమంత సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Telugu Bay Wishes, Ram Charan, Samantha, Shakunthalam, Tollywood, Web, Yashoda-M

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే నాగచైతన్యతో విడాకుల తర్వాత ఈమె వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.కెరీయర్ లో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం విడుదలకు సిద్ధమవుతోంది.ఇక సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.ఇవే కాకుండా మరొక హాలీవుడ్ చిత్రం,బాలీవుడ్ వెబ్ సిరీస్ కి కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube