నువ్వెప్పుడూ నా పక్కనే ఉన్నందుకు రుణపడి ఉంటా... ఎన్టీఆర్ ఎమోషనల్ విషెస్!

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు.

 Always Grateful To Have You By My Side: Jr Ntr,junior Ntr, Ram Charan, Ram Chara-TeluguStop.com

అయితే వీరి మధ్య ఉన్న ఈ స్నేహం ఈ సినిమాతో మొదలైంది కాదని ఎప్పటి నుంచో వీరి మధ్య ఇలాంటి స్నేహం ఉండటం వల్లే ఈ సినిమా కోసం వీరిద్దరిని తీసుకున్నానని రాజమౌళి వెల్లడించారు.ఇలా ఈ సినిమా ద్వారా రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య మంచి బంధం ఏర్పడింది.

సినిమా విడుదలైన తర్వాత కొందరు వీరి స్నేహబంధం పైన విషప్రచారం చేస్తున్నారు.

ఈ సినిమాలో రాజమౌళి రామ్ చరణ్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపించారని, ఈ విషయంపై ఎన్టీఆర్ కూడా కాస్త గుర్రుగా ఉన్నారనీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలన్నింటికి చెక్ పెడుతూ…ఎన్టీఆర్ ఒక అద్భుతమైన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వారి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి తెలియజేశారు.చరణ్ మార్చి 27వ తేదీ తన 37 వ పుట్టిన రోజును జరుపుకోవడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ పోలీస్ షర్ట్ వేసుకోగా… తారక్ షర్ట్ బటన్స్ పెడుతూ… పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్.నువ్వు ఎప్పుడు నా పక్కనే నాకు అండగా ఉన్నందుకు నీకు రుణపడి ఉంటాను.మన మధ్య ఉన్న అనుబంధానికి ఈ ఫోటో ఒక్కటే నిదర్శనం కాదు…ఇలాంటివి మన మధ్యలో ఎన్నో ఉన్నాయి అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటో ద్వారా వీరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తారక్ చెప్పకనే చెప్పేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube