'హనుమాన్' నైజాం రైట్స్ అన్ని కోట్లా.. ఎవరు దక్కించుకున్నారంటే?

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ‘హను – మాన్‘( Hanu Man ).ఈ సినిమా కోసం మన టాలీవుడ్ ఆడియెన్స్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Hanu Man Nizam Rights Update, Hanu Man Movie , Tollywood, Prashanth Varma-TeluguStop.com

ముందులో ఈ సినిమాపై ఇన్ని అంచనాలు లేవు.కానీ వన్స్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యి టీజర్ రిలీజ్ తో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ సైతం ఫిక్స్ అయ్యారు.విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ రిలీజ్ కు సిద్ధం చేసారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ( Hero Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇటీవలే ట్రైలర్ సైతం రిలీజ్ అయ్యింది.

Telugu Hanu, Hanu Nizam, Prashanth Varma, Teja Sajja, Tollywood-Movie

ట్రైలర్ చూసిన తర్వాత ఆడియెన్స్ లో మరిన్ని హోప్స్ పెరిగాయి.ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బిజినెస్ కూడా అన్ని చోట్ల అదిరిపోయే రేంజ్ లో చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.తాజాగా హనుమాన్ సినిమా నైజాం రైట్స్ గురించి డిటైల్స్ తెలుస్తున్నాయి.

Telugu Hanu, Hanu Nizam, Prashanth Varma, Teja Sajja, Tollywood-Movie

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నైజాం రైట్స్ ను మైత్రి మూవీ డిస్టిబ్యూషన్ ఎల్ఎల్పి నైజాం రీజియన్ డిస్టిబ్యూషన్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుందట.దాదాపు 7.2 కోట్ల రూపాయలతో మైత్రి సొంతం చేసుకుందని సమాచారం బయటకు వచ్చింది.ఈ రేంజ్ లో ధర పలకడంతో ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalaxmi Sarathkumar ), వినయ్ రాయ్ లు కీలక పాత్రల్లో నటించగా.అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరబ్ లు సంగీతం అందిస్తున్నారు.

ఇక ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube