టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో యాపిల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హన్సికకు ( Hansika ) ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.హన్సికను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.
ఎన్టీఆర్, బన్నీలకు జోడీగా నటించిన హన్సిక బిల్లా సినిమాలో( Billa movie ) ప్రత్యేక పాత్రలో మెరిశారు.తాజాగా ఈ బ్యూటీ తనకు జరిగిన అవమానాల గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు మాకు డ్రెస్సులు ఇవ్వడానికి డిజైనర్లు ( Hansika on Designers ) పెద్దగా ఆసక్తి చూపేవారు కాదని హన్సిక అన్నారు.మీరు సౌత్ హీరోయినా అంటూ వ్యంగ్యంగా మాపై కామెంట్లు చేసేవారని హన్సిక చెప్పుకొచ్చారు.
కొంతమంది డిజైనర్లు మాకు దుస్తులు ఇవ్వబోమని ముఖంపైనే చెప్పేవాళ్లు అని హన్సిక అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని హన్సిక వెల్లడించడం గమనార్హం.
మైము డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోవాలని ఇప్పుడు వాళ్లు బ్రతిమాలుతున్నారని హన్సిక చెప్పుకొచ్చారు.ఏదైనా ఈవెంట్ ఉంటే వారంతట వారే వచ్చి వాళ్లు ఇచ్చిన డ్రెస్ వేసుకోవాలని అడుగుతున్నారని హన్సిక పేర్కొన్నారు.డిజైనర్లు అప్పుడు మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు చాలా తేడా ఉందని ఆమె వెల్లడించారు.గతంలో వాళ్లు చులకనగా మాట్లాడిన సమయంలో నేను పగ పెంచుకోలేదని హన్సిక తెలిపారు.
ఆ నెగిటివ్ కామెంట్లకు బాధ పడలేదని మరింత కష్టపడాలని అర్థమైందని ఆమె పేర్కొన్నారు.నా వర్క్ తో ఆ డిజైనర్లను తిరిగి రప్పించాలని కసితో పని చేశానని హన్సిక అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఛీ కొట్టిన వాళ్లే నా దగ్గరికి తిరిగి రావడంతో ఆశ్చర్యం వేసేదని ఆమె అన్నారు.వాళ్లు నా దగ్గరకు వచ్చిన సమయంలో ఒక సెకన్ ఆలోచించి ఓకే చెప్పేదానినని హన్సిక వెల్లడించారు.
హన్సిక చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.