టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన హన్సిక ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటునారు.కొన్ని నెలల క్రితం ఈ ఆపిల్ బ్యూటీ పెళ్లి చేసుకోగా తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
బబ్లీ గర్ల్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హన్సిక గర నెలలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన సోహైల్ ను వివాహం చేసుకున్నారు.
హన్సిక రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మంచి హీరోయిన్ గా పాపులారిటీని సొంతం చేసుకున్నారు.31 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్న హన్సిక సంక్రాంతి పండుగను వాళ్లతోనే జరుపుకున్నారు.అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం గురించి హన్సిక స్పందిస్తూ పండుగ రోజులలో ఇతరులకు సహాయం చేయాలని తల్లి చిన్నప్పుడే చెప్పిందని హన్సిక వెల్లడించారు.
మనం ఇతరులకు మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని తల్లి చెప్పిందని తాను కూడా అదే నమ్ముతున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఈ కారణం వల్లే నటి అయిన తర్వాత నేను పిల్లల్ని దత్తత తీసుకున్నానని హన్సిక చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నాకు 31 మంది పిల్లలు ఉన్నారని హన్సిక కామెంట్లు చేశారు.పిల్లల్ని దత్తత తీసుకోవడం సంతోషాన్ని కలిగించిందని ఆమె చెప్పుకొచ్చారు.ఆ పిల్లలకు సంక్రాంతి రోజున కొత్త వస్త్రాలు కొనివ్వడంలో కలిగిన సంతోషం అంతాఇంతా కాదని హన్సిక చెప్పుకొచ్చారు.
దేవుని దయ వల్ల ప్రస్తుతం తాను సంతోషంగా జీవనం సాగిస్తున్నానని హన్సిక అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ మధ్య కాలంలో ఒక యాడ్ లో నటించానని సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చానని హన్సిక పేర్కొన్నారు.త్వరలో మళ్లీ వరుస షూటింగ్ లతో బిజీ అవుతానని ప్రస్తుతం తన చేతిలో 7 సినిమాలు ఉన్నాయని హన్సిక కామెంట్లు చేశారు.