వయసు పైబడే కొద్దీ మెదడు పనితీరు తగ్గుతుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి క్రమంగా మందగిస్తాయి.
కానీ ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు.చిన్న చిన్న విషయాలను సైతం ఇట్టే మరచిపోతుంటారు.
అందుకు ప్రధాన కారణం మెదడు పనితీరు నెమ్మదించడం.ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే నలబై, యాబై ఏళ్లు నిండకముందే జ్ఞాపక శక్తిని కోల్పోతారు.
అందుకే మెదడును ఎప్పటికప్పుడు చురుగ్గా మార్చుకుంటూ ఉండాలి.
అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెసిపీని తీసుకుంటే మెదడును చురుగ్గా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక నిమ్మ పండును తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, నిమ్మ పండు ముక్కలు, పది వాల్ నట్స్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు వన్ టేబుల్ స్పూన్ చొప్పున ప్రతి రోజు తీసుకోవాలి.
ఇలా చేస్తే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతాయి.అంతే కాదండోయ్ పైన చెప్పిన రెసిపీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది.ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.ఎముకలు దంతాలు దృఢంగా మారతాయి.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
బెల్లీ ఫ్యాట్ సమస్య దూరం అవుతుంది.మరియు చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా సైతం మారుతుంది.