విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తాము ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గురువారం ప్రకటించడం తెలిసిందే.ఈ ప్రకటనపై BRS పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు( KTR ) నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ వాళ్లే పార్లమెంటులో చేసిన పోరాటం వల్లే విశాఖ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసుకొచ్చిందని చెప్పుకొచ్చారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు పోరాడింది ఏమీలేదని గాలి తీసేశారు.
పరిస్థితి ఇలా ఉంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో BRS నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు( GVL Narasimha Rao ) ఖండించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పై BRS తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.అందరూ ఆమోదిస్తేనే ప్రైవేటీకరణ జరుగుతుందని స్పష్టం చేశారు.ప్లాంట్ కొనేస్తున్నట్లుగా కేసిఆర్, కేటీఆర్ ప్రచారం చేసుకోవడం అవివేకమని చెప్పుకొచ్చారు.

ఉద్యోగాల భద్రతకు.ప్లాంట్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు.స్టీల్ ప్లాంట్ CMD అతుల్ భట్ తో సమావేశమైన జివిఎల్ పరిశ్రమ ప్రస్తుత పని తీరుపై చర్చించడం జరిగింది.మరోపక్క విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదంటూ కేంద్ర ప్రభుత్వం( Central Government ) ఈరోజు ప్రకటన చేయటం సంచలనం సృష్టించింది.







