పూర్తిస్థాయిలో పాఠశాలలు తెరిస్తే సంగతేంటి?.. గురుకులం లో 50 మంది విద్యార్థులకు కరోనా...

కొన్ని రోజుల క్రితం నుండి బాగా ప్రతిభ కన పరుస్తున్న 10 వ తరగతి, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులకు ఓ గురుకుల కేంద్రంలో తరగతులు నిర్వహిస్తున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితోనే ఆ గురుకుల కేంద్ర నిర్వాహకులు, గురుకుల కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

గురుకుల కేంద్రంలో మొత్తం 50 మంది విద్యార్థులతో పాటు,అక్కడ విధులు నిర్వహిస్తున్న 6 మంది ఉపాధ్యాయులకు కూడా కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తుంది.గురుకుల కేంద్రంలో విద్యార్థులకు కరోనా సోకడంతో, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కరోనా వ్యాధికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహించడమే ఉత్తమమని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలను నిర్వహిస్తే మాత్రం విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తాజాగా తెలంగాణ లో చోటుచేసుకున్న ఈ ఘటన.ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పాఠశాలలు పునః ప్రారంభిస్తే ఎంత ప్రమాదమో చెప్పకనే చెబుతోంది.తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాతిమ్మాపూర్ మండలం అలుగునూర్ గురుకుల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

ఈ మేరకు ఆ గురుకుల యాజమాన్యం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు