రోజుకు 400 మంది కడుపు నింపుతోన్న ఎన్ఆర్ఐ ఆలోచన.. అన్నార్తుల వద్దకే ఆహారం

పంజాబ్‌ రాష్ట్రం హోషియార్‌పూర్‌లోని చేలా గ్రామానికి చెందిన కెనడాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ గుర్జీందర్ సింగ్ తన పెద్ద మనసు చాటుకున్నారు.పేదలు, ఆకలిగా వున్న వారికి ప్రతిరోజూ ఆహారం అందించాలనే లక్ష్యంతో ఆయన ‘‘నిష్కామ్ సేవా సొసైటీ’’ని స్థాపించారు.

 Guru Ki Rasoi Distributes 400 Free Lunch Boxes Across Nawanshahr And Hoshiarpur-TeluguStop.com

ఈ సంస్థ నవన్‌షహర్, హోషియార్‌పూర్‌లలో ప్రతిరోజూ 400కి పైగా ఉచిత లంచ్ బాక్స్‌లను పంపిణీ చేస్తోంది.నవాన్‌షహర్‌లోని గురునానక్ మిషన్ సేవా సొసైటీ సహాయంతో నిష్కామ్ సేవా సొసైటీ పట్టణంలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో, హోషియార్‌పూర్‌లోని ఖరార్ అచ్రావాల్ గ్రామంలో ‘‘గురు కీ రసోయి’’ పేరుతో శాశ్వతంగా కిచెన్ ఏర్పాటు చేసింది.

ఇక్కడి నుంచి వేడి వేడి టిఫిన్‌లను వాలంటీర్లు ప్యాక్ చేసి పంపుతారు.చపాతీలు, రైస్‌తో పాటు కాయగూరలతో చేసిన కూరలను వీరు అందజేస్తున్నారు.

దీనిపై గురునానక్ మిషన్ సేవా సొసైటీ అధ్యక్షుడు సూర్జిత్ సింగ్ మాట్లాడుతూ.గురు కీ రసోయి అనేది ఎన్ఆర్ఐ గుర్జీందర్ సింగ్ ఆలోచన అని చెప్పారు.తన బాల్యం గడిచిన గ్రామానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో తన స్నేహితుడు కుల్వంత్ సింగ్‌తో ఆయన దీనిపై చర్చించాడని సూర్జిత్ చెప్పారు.కుల్వంత్ ఆ విషయం మాతో చెప్పాడని.

దీనిని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు గాను ఫ్లాట్ కోసం తీవ్రంగా గాలించామని ఆయన తెలిపారు.

గతేడాది ఏప్రిల్‌లో తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని.

ఆ సమయంలో కేవలం 22 టిఫిన్ బాక్స్‌లు మాత్రమే పంపిణీ చేసేవారమని, కొద్దిమంది వాలంటీర్లు మాత్రమే వుండేవారని సూర్జిత్ తెలిపారు.అయితే ప్రస్తుతం తమ బృందం పెరిగిందని.

ఇప్పుడు రోజుకు 400 మందికి భోజనం అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు.అంతేకాకుండా.

సమీప గ్రామాలకు చెందిన ప్రజలు కూడా తాము చేస్తున్న మంచి పని గురించి తెలుసుకుని ఆహారాన్ని తయారు చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి సాయం చేస్తున్నారని సూర్జిత్ సింగ్ పేర్కొన్నారు.ప్రజలు వాట్సాప్ గ్రూప్, ఫేస్‌బుక్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ద్వారా తమను సంప్రదిస్తారని ఆయన తెలిపారు.

తమ సొసైటీకి చెందిన వాలంటీర్లు వారు నిజంగా అవసరంలో వున్నారా లేదా అన్నది నిర్ధారించేందుకు బాధితుల ఇంటికి వెళ్తారని చెప్పారు.ఈ ఉచిత సేవను పొందుతున్న వారిలో 90 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన వున్న కుటుంబాలకు చెందిన వారేనని.

మిగిలిన పది శాతం మంది వృద్ధులేనని నిర్వాహకులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube