గుంటూరు టీడీపీ లో చిచ్చు పెట్టిన “మహేష్ బాబు”

మహేష్ బాబు స్పైడర్ సినిమా రిలీజ్ అయ్యి అభిమానుల ఆదరణ అందుకుంటున్న విషయం తెలిసిందే ఈ సినిమా హిట్టా.రికార్డ్స్ సృష్టిస్తోందా అనే విషయాన్ని పక్కనపెడితే.

 Gunturu Tdp Mp & Mla War Reason Spider Movie-TeluguStop.com

తెలుగుదేశం పార్టీలో మాత్రం పెద్ద చిచ్చు పెట్టింది అనే వార్తలు మాత్రం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి.ఏకంగా గుంటూరు టీడీపీని రెండుగా చీల్చేసింది.

కేవలం ఈ చిత్ర ఫ్లెక్సీల విషయంలో గుంటూరులో పెద్ద గొడవే జరుగుతోంది.అసలు విషయంలోకి వెళ్తే

స్పైడర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది.

కొన్ని వర్గాల ప్రేక్షకులని ఈ చిత్రం ఆకట్టుకుంటుండగా, కొన్ని వర్గాలని నిరాశపరుస్తోంది.స్పైడర్ చిత్ర విడుదల సందర్భంగా గల్లా జయదేవ్ అనుచరులు కొందరు ఫ్లెక్సీలని ఏర్పాటు చేసారు.

అందులో మహేష్ బాబు, గల్లా జయదేవ్ ల ఫోటోలు మాత్రమే ఉన్నాయ్.స్థానికి లీడర్ అయిన తన ఫోటో లేకపోవడంతో ఎమ్మెల్యే అలక వహించారు.

దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే గుంటూరు పురపాలక సంఘం వారికి చెప్పి ఆ ఫ్లెక్సీలు పీకించేశారు

గల్లా జయదేవ్ అనుచరులు ఆయనకు సమాచారాన్ని చేరవేయగా మున్సిపల్ అధికారులని ఆయన వివరణ అడిగారట.దీనికి అధికారులనుంచి సరైన సమాధానం రాకపోవడంతో గల్లా ఎమ్మెల్యే పై ముఖ్యమంత్రితో ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ వివాదం చిలికి చిలికి గల్లా ,ఎమ్మెల్యేల మధ్య వార్ ని పెంచుతోంది.ఇప్పుడు ఆ గొడవ ఏకంగా గుంటూరు టీడీపిలో ఎమ్మెల్యే వర్గం.

ఎంపీ వర్గంగా విడిపోవడం సార్వాత్ర చర్చనీయాంసం అయ్యింది.కేవలం ఫ్లెక్సీకి సంబందించిన విషయం పార్టీలోని అగ్రనాయకులు మధ్య గొడవగా మారడంతో తెలుగు దేశం పార్టీ క్యాడర్ ముక్కున వేలేసుకుంటోంది.

కేవలం ఫ్లెక్సీలకోసం సాధారణ వ్యక్తుల్లాగా పార్టీ పరువును రోడ్డున పడేస్తార అని సీనియర్ నాయకులు నవ్వుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube