టీడీపీకి షాక్‌.. రేపో మాపో వైసీపీలోకి ఎమ్మెల్యే జంప్‌

మొన్న‌టివ‌రకూ ప్రతిప‌క్ష వైసీపీ నుంచి అధికార టీడీపీలో ఎవ‌రు చేర‌తారా అని అంతా ఎదురుచూసేవారు.కానీ ప్ర‌స్తుతం ఆ సీన్ రివ‌ర్స్ అయింది.

పార్టీలో త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌నే కారణంతోనో.రాజ‌కీయ విభేదాల కార‌ణంగానో టీడీపీని నుంచి వీడుతున్న వారిసంఖ్య అధిక‌మవుతోంది.

క‌ర్నూలుకు చెందిన గంగుల వ‌ర్గం వైసీపీ కండువా క‌ప్పుకోగా.అదే జిల్ల‌కు చెందిన శిల్పా సోద‌రులు కూడా పార్టీ మారే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అసలే ఇవి అధినేత చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారితే.ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా వైసీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జోరందుకుంది.

Advertisement

గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నా.త‌న మాటకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని తీవ్రంగా మ‌థ‌న‌ప‌డుతున్నార‌ట‌.

టీడీపీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన.ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఉనికి కోసం పోరాడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ట‌.ముఖ్యంగా పార్టీలోకి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు రావ‌డంతో.

త‌న‌కు అంత‌గా ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని బాధ‌ప‌డుతున్నార‌ట‌.దీంతో పాటు న‌ర‌సరావు పేట ఎంపీ టికెట్‌ను మోదుగుల‌కు కాద‌ని రాయ‌పాటికి కేటాయించారు.

పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని నచ్చజెప్పి గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేలా ఒప్పించారు చంద్ర‌బాబు.అయితే పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు.అలాగే సొంత నియోజకవర్గంలోనూ ఆయనపై ఇతర నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారట‌.

Advertisement

ఆయ‌న సిఫార్సును పట్టించుకోక‌పోగా.నియోజకవర్గంలో పదవులను ఆయనకు తెలియకుండానే ఇస్తున్నారట.

ఇలా అడుగడుగునా అవమానం జ‌రుగుతుండ‌టంతో.ఈ విష‌యాన్ని అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌స్తావించేందుకు వెళ్ల‌గా అక్క‌డా చుక్కెదురైంద‌ట‌.

గుంటూరు జిల్లా నేతలతో చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌మీక్ష‌లో.మోదుగులపై ఫైర్ అయ్యారు.

ఇష్టమొచ్చినట్టు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ఏమిటని, పద్దతి మార్చుకోవాలని సూచించార‌ట.అంతేగాక ప‌ద్ధ‌తి మ‌ర్చుకోని ప‌క్షంలో చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించార‌ట‌.

దీంతో ఆయ‌న తీవ్రంగా మ‌న‌స్థాపానికి గుర‌య్యార‌ట‌.దీంతో ఆయ‌న వైసీపీ వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

త‌న వ‌ర్గంతో సమావేశమై త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని ముఖ్య అనుచరులకు సంకేతాలిచ్చారట‌, .

తాజా వార్తలు