గుంటూరు కారం ఐటెం సాంగ్ ఫైనల్ అప్డేట్.. ఏం చేయబోతున్నారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం( Guntur Karam ).

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.

ఇక రిలీజ్ కు కాస్త సమయమే ఉంది.ఈ నెలలోనే షూట్ మొత్తం పూర్తి చేయాలి.ఇప్పటికే శరవేగంగా పూర్తి చేస్తూ లాస్ట్ స్టేజ్ కు వచ్చింది.

అయితే కొద్దిగా టాకీ పార్ట్ తో పాటు రెండు సాంగ్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.మరి ఇందులో ఐటెం సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement

ఐటెం సాంగ్ గురించి ముందు నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి.ఈ సాంగ్ కోసం ఇంకా ఏ హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేయలేదట.

ప్రజెంట్ ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉండగా ఒక పేరు ఫైనల్ కాగానే వెంటనే షూట్ స్టార్ట్ చేయనున్నట్టు టాక్.ఏది ఏమైనా డిసెంబర్ 25 లోపులోనే మొత్తం ఫినిష్ చేయాలనీ చూస్తున్నారు.

ఆ వెంటనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.మరి ఈ సాంగ్ లో ఏ హీరోయిన్ మహేష్ తో ఆడి పాడుతుందో చూడాలి.కాగా మహేష్, త్రివిక్రమ్ ( Trivikram Srinivas ) సూపర్ హిట్ కాంబో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ( SreeLeela Meenakshi Chaudhary )హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు