'గుంటూరు కారం' స్టోరీ లైన్ లీక్.. ఇలా ఉంటే బ్లాక్ బస్టర్ ఖాయమే?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ మసాలా మూవీ ‘‘గుంటూరు కారం”.( Guntur Kaaram ).ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా శ్రీలీల, మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary )హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

 Guntur Kaaram Movie Story Leaked, Guntur Kaaram, Mahesh Babu, Trivikram, Poo-TeluguStop.com

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇక ఇప్పుడు శరవేగంగా షూట్ పూర్తి చేస్తున్నారు.ఈ సినిమాలో కీలక రోల్స్ లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, సునీల్, అలీ, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.మరి వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా గుంటూరు నగరం నేపథ్యంలో జరుగుతుందట.

ఆ నగరంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను బట్టబయలు చేసేందుకు ఒక లేడీ జర్నలిస్టు పని చేస్తుందట.మరి ఈ జర్నలిస్టుతో అదే నగరంలో ఉంటున్న యువకుడు ప్రేమలో పెడతారట.

ఆ తర్వాత ఆ యువకుడు విలన్స్ నుండి ఆ జర్నలిస్టును ఎలా కాపాడాడు.విలన్స్ కు ఎలా ఎదురు తిరిగాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్ వైరల్ అవుతుంది.సూపర్ స్టార్ చాలా ఏళ్ల తర్వాత మాస్ అండ్ పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.దీంతో త్రివిక్రమ్( Trivikram Srinivas ) ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధం చేస్తున్నాడు.

చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube