'గుంటూరు కారం' షూట్ కోసం ఇల్లు వెతుకులాట.. మరి దొరికేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మూవీ గుంటూరు కారం.

ఈ మాస్ కమర్షియల్ సినిమాకు ముందు నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేసారో తెలియదు కానీ ఎప్పుడు ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది.ఎట్టకేలకు అన్ని సెట్ చేసుకుని జనవరిలో స్టార్ట్ అయ్యింది అనుకుంటే పట్టుమని రెండు షెడ్యూల్స్ చేసారో లేదో మళ్ళీ మూడు నెలలుగా వాయిదా లోనే ఉంది.

మరి గత కొన్ని రోజులుగా వాయిదాలో ఉన్న ఈ సినిమాను ఇప్పుడు మేకర్స్ పాటతో స్టార్ట్ చేస్తారా? లేదంటే ప్రకాష్ రాజ్( Prakash Raj ) మీద సీన్స్ తో స్టార్ట్ చేస్తారా? అదీ కాదంటే ఫైట్ తో స్టార్ట్ చేస్తారా? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్నాయి./br>

ఎట్టకేలకు ప్రకాష్ రాజ్ డేట్స్ అయితే అతి కష్టం మీద ఈ నెల 20 నుండి దిరికినట్టు అందుకే అప్పటి నుండే ఈ షూట్ స్టార్ట్ చేస్తున్నట్టు అంటున్నారు.మరి ఈయనతో ఒక ఇంటిని చూపించి అందులో సీన్స్ చేయాలట.అందుకు సెట్ అంటే వెంటనే రెడీ అయ్యే పని కాదు.

Advertisement

ఈ క్రమంలోనే సూటయ్యే ఇంటి కోసం వెతుకుతున్నట్టు టాక్.ఈ లోగా ఒక పాట కానీ ఫైట్ కానీ చేసే ఐడియాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే స్టార్ట్ చేసే వరకు నమ్మకం అయితే లేదు.గతంలో వేసిన రెండు షెడ్యూల్స్ కాకుండా ఇంకా ఈ సినిమా 78 రోజుల పాటు షూట్ ఉందట.నెలకు 20 రోజులు వర్క్ చేసిన అక్టోబర్ ఎండ్ వరకు మొత్తం పూర్తి చేసి రాజమౌళి సినిమాలో ( Rajamouli )జాయిన్ అవ్వాలనేది మహేష్ బాబు ఆలోచన.

మరి ఆలస్యం అవుతూ వస్తున్న ఈ సినిమా వీరు అనుకున్న సమయానికి పూర్తి అవుతుందో లేదో వేచి చూడాలి.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు