సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ మసాలా మూవీ ”గుంటూరు కారం”( Guntur Kaaram ).ఈ సినిమా నుండి ఇటీవలే కృష్ణ గారి జయంతి సందర్భంగా మాస్ స్ట్రైక్ అంటూ వీడియో, టైటిల్ ను రిలీజ్ చేసారు.
ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ను రిలీజ్ చేసారు.

మంచి మాస్ మసాలా సినిమాగా త్రివిక్రమ్ దీనిని తెరకెక్కిస్తున్నాడు.ఈ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ నుండి మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా మంచి రెస్పాన్స్ లభించింది.ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నాడు.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను జూన్ 7 నుండి స్టార్ట్ చేస్తారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కు కొద్దిగా చిక్కులు వచ్చినట్టు తెలుస్తుంది.
ఎందుకంటే జూన్ 7న స్టార్ట్ అయితే ఈ సినిమా సెప్టెంబర్ వరకు ఆగకుండా కంటిన్యూగా షూట్ చేయాలని మహేష్ ప్లాన్.అయితే ఇన్ని రోజులు అంటే మిగతా ఆర్టిస్టులకు కాల్ షీట్స్ ఇవ్వడం కొద్దిగా కష్టమే.

అందులోను ఇంతకు ముందు చెప్పిన సమయానికి షూట్ జరగక పోవడంతో కాల్ షీట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి.ఇప్పుడు కొత్తగా అందరివీ తీసుకుని సెట్ చేసుకునే పనిలో మేకర్స్ ఉన్నారట.ఎవరిని పడితే వారిని తీసుకోలేం.అందుకే అవి సెట్ చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారట.అయితే సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ దగ్గరే సమస్య అవుతుందని టాక్.ఈయన ఇచ్చిన డేట్స్ మేకర్స్ వాడుకోలేక పోయారట.
ఇప్పుడు డేట్స్ కావాలంటే ఆయనకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని.ఈయన డేట్స్ గురించే డిస్కర్షన్ జరుగుతుందని తెలుస్తుంది.
గతంలో ఇప్పటికే మంచి అడ్వాన్స్ ఇచ్చారని.కానీ మరికొంత అడ్వాన్స్ అడుగుతున్నారని టాక్ వాట్సఉంది.
ఇవన్నీ క్లియర్ చేసుకుని 7 నుండి కానీ 10 నుండి కానీ స్టార్ట్ అవుతుందని టాక్.
