సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తుంటే ఈ సినిమా అంత ఆలస్యం అవుతూ వస్తుంది.సినిమా ప్రకటించినప్పటి నుండే అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.

మహేష్ వల్ల మొదటి నుండి వాయిదా పడుతూనే ఉంది.ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా( Guntur Karam Movie ) ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది.మొన్నటి వరకు ఈ సినిమా షూట్ మహేష్ వెకేషన్( Mahesh Babu Vacation ) వెళ్లడంతో ఆగిపోయింది.మహేష్ లాంగ్ వెకేషన్ ముగించుకుని ఇటీవలే ఇండియాకు వచ్చారు.
దీంతో మళ్ళీ చాలా రోజుల తర్వాత షూట్ స్టార్ట్ చేసారు.
ప్రజెంట్ చాలా వేగంగా షూట్ జరుగుతున్నట్టు టాక్.
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మూవీ కీలకమైన యాక్షన్ షెడ్యూల్( Guntur Karam Action Scenes ) ను చేస్తుందట.ఇంటర్వెల్ ఫైట్ కు సంబంధించిన భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు.
ఈ వార్తతో మళ్ళీ ఫ్యాన్స్ కొద్దిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఎట్టకేలకు షూట్ స్టార్ట్ అయ్యి సూపర్ ఫాస్ట్ గా దూసుకు పోతుంది.

కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.







