నల్లజర్ల మండలంలో తుపాకీ కాల్పులు వ్యక్తి దారుణ హత్య..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతతకు మారుపేరుగా ఉభయగోదావరి జిల్లాలు పేర్లు వినపడతాయి.చాలా వరకు గొడవలు గాని ఒకరిపై మరొకరు దాడులు గాని పెద్దగా ఉండవు.

 Gunfire In Nallajarla Mandal Man Died Details, Crime News, Nallajarla, Gunfire-TeluguStop.com

ప్రశాంతతకు నిలయమని గోదావరి జిల్లాల గురించి మాట్లాడుకుంటారు.గోదావరి జిల్లాలకు( Godavari District ) చెందిన ప్రజలు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతారని అంటారు.

ఆ ప్రాంతాలలో ఎటకారం.మమకారం చాలా ఎక్కువ అని అంటుంటారు.కానీ ఇదంతా ఒకప్పటి వాతావరణం.ఇప్పుడు పరిస్థితులు మొత్తం రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి.

ఇటీవల గోదావరి జిల్లాలలో కూడా గొడవలు పెరిగిపోతున్నాయి.చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెందుతూ చంపేసుకునే పరిస్థితి దాపరించింది.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం( Nallajarla Mandal ) పుల్లలపాడులో కాట్రగడ్డ ప్రభాకర్ నీ( Katragadda Prabhakar ) గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపడం జరిగింది.ఘటనా స్థలంలో ప్రభాకర్ కుప్పకూలిపోయాడు.

దుండగుడు రెండు రౌండ్ల కాల్పులు జరపటంతో రక్తపు మడుగులో ప్రాణాలు విడవడం జరిగింది.ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటన స్థానికంగా అందరిని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దుండగుడిని పట్టుకోవడానికి బృందాలుగా గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube