వాళ్ళిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు.అయితే కొన్ని కారణాలతో తనని ప్రియురాలు దూరం పెట్టిందని కోపంతో రెచ్చిపోయిన ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు.
తనతో మాట్లాడటం పూర్తిగా మానేసిందన్న కోపంతో ఆమెను కిరాతకంగా మట్టు పెట్టాడు.దాంతో యూట్యూబ్ లో శోధించి తానే స్వయంగా తుపాకీ తయారు చేసి మరీ ఆమెను కాల్చేశాడు.
ఆ తర్వాత కత్తి తో కూడా పొడిచి చంపేశాడు.ఇకపోతే ఈ సంఘటన కలకత్తా మహానగరం లో చోటుచేసుకుంది.
కలకత్తా నగరంలోని రీజెంట్ పార్క్ ఏరియాలో నివసిస్తున్న ఓ ఇరవై సంవత్సరాల అమ్మాయి అదే ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ రాకేష్ ( 26 ) అనే వ్యక్తిని ప్రేమించింది.అయితే అతడు ఆ అమ్మాయికి తనకు పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు.
కొద్దిరోజుల తర్వాత అతని నిజ స్వరూపం తెలుసుకున్న ఆమె మోసగాడని అతనిని దూరం పెడుతూ వచ్చింది.దీంతో ఆమె పూర్తిగా అతనితో మాట్లాడడం మానేసింది.
ఇక అంతే ప్రియురాలు తనతో మాట్లాడటం లేదని కోపంతో ప్రియురాలిని ఎలాగైనా మట్టుపెట్టాలని అతడు నిర్ణయించుకున్నాడు.అనుకున్నది అనుకున్నట్టుగా తానే స్వయంగా తుపాకీని తయారు చేశాడు.
స్వతహాగా కారు డ్రైవర్ అవ్వడంతో ఇంజన్ మరమ్మతులో ఉన్న తన ప్రావీణ్యాన్ని తుపాకీ తయారీ విధానంలో ఉపయోగించాడు.యూట్యూబ్ లో దొరికే అనేక రకాల తయారీ విధానానికి సంబంధించిన వీడియోలు చూసి అతను తుపాకీ తయారు చేశాడు.
అందుకు సంబంధించి సైకిల్ స్టోర్స్ లో నుండి చిన్న చిన్న ఐరన్ పైపులు, బాల్ బేరింగ్స్ లాంటి వస్తువులను సేకరించి ఆ వస్తువులతో తుపాకి తయారు చేశాడు.
ఆ తుపాకీలోకి బేరింగ్ బాల్స్ ని తూటాలుగా ఉపయోగించాడు.
బొమ్మ తుపాకీ లో లభించే కొన్ని వస్తువులను వాడి ట్రిగ్గర్ నొక్కగానే బాల్ బేరింగ్ దూసుకెళ్లే విధంగా తుపాకీని తయారు చేశాడు.ఇక అంతే మరుసటి రోజు తన ప్రియురాలి ఇంటి దగ్గరికి వెళ్లి ఆమెను బయటకు లాగి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్చాడు.
దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.అయినా అతనికి కోపం చల్లారక కత్తి తో కసిగా పొడిచాడు.విచక్షణా రహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.