గుమ్మడి కూతురి పెళ్లికి ఎన్టీఆర్ ని పిలిచినా ఎందుకు రాలేదు ?

గుమ్మడి. ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం.

 Gummadi Relation With Sr Ntr Details, Actor Gummadi, Gummadi Venkateswara Rao ,-TeluguStop.com

అతి చిన్న వయసులో ఎంతో భారమైన, పరిణితి కి మించిన పాత్రలు ధరించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.గుమ్మడి నటన జీవితానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ గురించి చెప్పాలంటే ఆయన నటించిన అర్ధాంగి సినిమాలో గుమ్మడి కి భార్యగా నటించిన నటిమని శాంతకుమారి.

అప్పటికే గుమ్మడి కంటే ఎనిమిది సంవత్సరాలు పెద్ద వయసు కలిగింది శాంతా కుమారి.ఇక గుమ్మడి కి పెద్ద కొడుకు గా నటించింది అక్కినేని నాగేశ్వరరావు.

గుమ్మడి కంటే ఆ సమయానికి అక్కినేని వయసు మూడు సంవత్సరాలు ఎక్కువ.గుమ్మడి కి చిన్న కొడుకుగా నటించిన జగ్గయ్య వయసు కూడా గుమ్మడి కంటే సంవత్సరం పెద్ద.

ఇలా తనకంటే పెద్ద హీరోలకు తండ్రిగా, అన్నగా నటించి పెద్ద పాత్రలకు పెట్టింది పేరుగా గుమ్మడి నటనా జీవితం కొనసాగింది.

ఇక గుమ్మడి కి సీనియర్ ఎన్టీఆర్ కి మధ్యలో కొన్నేళ్లపాటు కోల్డ్ వార్ జరిగింది.

వాస్తవానికి గుమ్మడి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటుడు నాగయ్య ఆఫీస్ లోనే ఒక రూమ్ లో ఉండేవాడు.మొదటి రెండు సినిమాల వరకు కూడా అక్కడే ఆశ్రయం పొందాడు.

ఇక ఆ తర్వాత తన మకాం ఒక హోటల్ రూమ్ కి మార్చుకున్నాడు గుమ్మడి.ఆ సమయంలో టి.ఎన్.టి వారి ఆఫీస్ ఎదురుగా సంగీత దర్శకుడు టీవీ రాజు ఒక హోటల్లో ఎన్టీ రామారావు తో కలిసి ఉండేవారు.అక్కడ గుమ్మడి తో ఎన్టీఆర్ కి జరిగిన పరిచయం, చివరికి తన సొంత చిత్రంలో గుమ్మడి కి పిలిచి మరి అవకాశం ఇచ్చే స్థాయికి ఎదిగింది.ఆ తర్వాత అనేక సినిమాల్లో గుమ్మడి ఎన్టీఆర్ కలిసి నటించారు.

ఆ తర్వాత కాలంలో అక్కినేని కి ఎన్టీఆర్ కి పొసగకపోవడం వారి మధ్య వివాదాలకు తావిచ్చింది.

Telugu Gummadi, Arthangi, Gummadi Ntr, Shanta Kumari, Sr Ntr-Movie

ఆ సమయంలో అక్కినేని సినిమాల్లో ఎక్కువగా గుమ్మడి కనిపించేవాడు.దాంతో గుమ్మడిని అక్కినేని మనిషిగా ఎన్టీఆర్ భావించి దూరం పెట్టాడు.ఇది ఎక్కడ వరకు వెళ్లిందంటే గుమ్మడి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి తన కుమార్తె పెళ్లికి రావలసిందిగా కోరినా కూడా ఎన్టీఆర్ రాలేదు.

దాంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు గుమ్మడి.ఆ తర్వాత కాలంలో అక్కినేని ఎన్టీఆర్ కలిసిపోయి గుమ్మడి విషయంలో తాను చేసిన తప్పు గ్రహించి ఎన్టీఆర్ మరలా తన సినిమాల్లో అవకాశం ఇచ్చాడు గుమ్మడి కి ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ జరగగా అది అక్కినేని ఎన్టీఆర్ ల కలయికతో సమసిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube