పూర్వీకులతో పోలిస్తే మారిన జీవనశైలి కారణంగా మన శరీరం పటిష్టంగా ఉండడం లేదు.ముఖ్యంగా ఏదైనా తినాలంటే పంటి నొప్పితో చాలా మంది బాధ పడుతున్నారు.
చెరుకుగడలు, ఇంకేవైనా గట్టి ఆహార పదార్ధాలు కొరికి తిన్నప్పుడు పళ్లు ఊడిపోతాయేమో అనేంతగా బాధ పుడుతుంది.ఇక చల్లటి పదార్ధాలు తిన్నప్పుడు లేదా తాగినప్పుడు పళ్లు జివ్వుమంటాయి.
దీంతో ఏం తినాలన్నా, తాగాలన్నా పంటి నొప్పి సమస్య కారణంగా పలువురు ఇబ్బందులు పడుతుంటారు.డెంటిస్టులను ఆశ్రయించడం, చికిత్స చేయించుకోవడం, తరచూ పేస్టులు మార్చడం వంటివి చేస్తుంటారు.
అయితే ఓ వ్యక్తి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.తన పళ్లతో ఏకంగా కార్లను లాగేసి వార్తల్లో నిలిచాడు.
ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ ప్రాంతంలో బ్యాంక్స్ టౌన్ వద్ద ఇటీవల ఓ వ్యక్తి అరుదైన ఫీట్ సాధించాడు.
ట్రాయ్ కాన్లీ మాగ్నస్సన్ అనే వ్యక్తి ఏకంగా ఐదు ఎస్‌యూవీ కార్లను నోటితో లాగాడు.వాటికి తాడు కట్టి, తన పళ్లతో 100 అడుగుల దూరం లాగి, అందరినీ ఆశ్చర్యపరిచాడు.2021 నవంబర్ 17న ఆ రికార్డును ట్రాయ్ కాన్లీ సాధించాడు.అయితే తాజాగా ఆ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఆ వ్యక్తి సాధించిన ఫీట్‌కు గిన్నిస్ బుక్ రికార్డు అందించినట్లు తెలిపింది.ఇంత పెద్ద రికార్డు సాధించిన ట్రాయ్ కాన్లీలో పరోపకార గుణం కూడా ఎక్కువే.స్వచ్ఛంద సంస్థల తరుపున ఫండ్ సేకరించేందుకు గతంలో పలుమార్లు ఇలాంటి రికార్డులు ఆయన సాధించాడు.ఇక ఆయన వీడియోపై నెటిజన్లు నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
అతడి పళ్లు చాలా గట్టివని కొనియాడుతున్నారు.







