గల్ఫ్ కష్టాలు : ఎంపీ చొరవతో ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న ఐదుగురు మహిళలు

Gulf Ordeal 5 More Indian Women Return , Indian Women , Indians, Pritam Kaur, Oman, Balbir Singh Seechewal, Muscat, Oman, Indian Embassies

ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.

 Gulf Ordeal 5 More Indian Women Return , Indian Women , Indians, Pritam Kaur, Om-TeluguStop.com

ఏదైతేనేం.భారతీయులు( Indians ) ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు.

కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.గల్ఫ్ గోసలు అంతా ఇంతా అని చెప్పలేము.

గల్ఫ్ కష్టాలు పగవాడికి కూడా రావద్దని అక్కడి నుంచి తిరిగి వచ్చిన బాధితులు చెబుతుంటారు.కార్మికులను మభ్యపెట్టి సందర్శకుల పేరిట వారిని ట్రావెల్‌ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.

గడువు ముగిసిన తరవాతా వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్‌పోర్టులు ( Visas , passports )లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.

భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని అక్కడి సంస్థలు, యజమానులు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.

Telugu Balbirsingh, Indian, Indians, Muscat, Oman, Pritam Kaur-Telugu NRI

అలా దేశం కానీ దేశంలో యజమాని చెరలో మగ్గిపోయి ఎట్టకేలకు స్వదేశం చేరుకుంది ప్రీతమ్ కౌర్( Pritam Kaur ) (పేరు మార్చాం).ఆమె ఒమన్‌లో ఎన్నో కష్టాలు అనుభవించింది.సగం ఆహారం, సగం జీతంతో ఇబ్బందులు పడి ఓ గురుద్వారాను చేరుకుని అక్కడి నుంచి భారతదేశానికి రాగలిగింది.

రాజ్యసభ సభ్యుడు బల్బీర్ సింగ్ సీచెవాల్ ( Balbir Singh Seechewal )ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రీతమ్ కౌర్, మరో నలుగురిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు.మస్కట్, ఒమన్‌లలో( Muscat, Oman ) భారీ జీతాలు ఆశపెట్టి వీరు ఐదుగురిని ట్రావెల్ ఏజెంట్లు బుట్టలో వేసుకున్నారు.

తీరా అక్కడికి వెళ్లాక గానీ తాము మోసపోయినట్లు వీరు గ్రహించలేకపోయారు.గంటల తరబడి పనిచేయించుకుని తక్కువ జీతాన్ని వీరి చేతిలో పెట్టారు.దీనికి తోడు శారీరకంగా, మానసికంగా వేధింపులు సైతం ఎదుర్కొన్నారు.

Telugu Balbirsingh, Indian, Indians, Muscat, Oman, Pritam Kaur-Telugu NRI

ఈ ఐదుగురు బాధితులు పంజాబ్‌లోని జలంధర్, ఫిరోజ్‌పూర్, మోగా, కపుర్తలా జిల్లాలకు చెందినవారు.ఈ ఏడాది ఆగస్ట్ 23 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న దాదాపు 15 మంది బాధితులను ఎంపీ సీచెవాల్ వెనక్కి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

ట్రావెల్ ఏజెంట్ల మోసాలపై ప్రజలు అవగాహన కలిగి వుండాలన్నారు.భారత ప్రభుత్వం, గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల మద్ధతుతో 15 మంది మహిళలను వెనక్కి తీసుకొచ్చానని ఎంపీ చెప్పారు.15 మందిలో 13 మంది ఒమన్ నుంచి, ఇద్దరు ఇరాక్ నుంచి వచ్చినట్లుగా సీచెవాల్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube