కాలయాపనకు, అవినీతికి చెల్లుచీటి: తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టంపై ఎన్ఆర్‌ఐల ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వం భూపరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది.1985లో ఎన్టీఆర్ చేపట్టిన సంస్కరణల తర్వాత ఇవే అతి పెద్ద సంస్కరణలు.

భూ నిర్వహణలో సరళీకృత, అవినీతి రహిత, బలహీనులుకు మేలు చేసే విధంగా నూతన రెవెన్యూ చట్టాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.దీనిని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు స్వాగతించారు.

దేశం కానీ దేశంలో ఎంతో కొంత సంపాదించిన ప్రవాసులు.భవిష్యత్తులో ఆసరాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో భూమిని లేదా ఇంటిని కొనుగోలు చేసేవారు.

పండక్కో, పబ్బానికో సొంతూరికి వచ్చి లావాదేవీలు పూర్తి చేసి వెళ్లేవారు.అయితే ఉన్న కొద్దిపాటి సమయంలో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వంటి పనులు పూర్తి కాక ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారు.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణలు కారణంగా స్థానికులతో పాటు ఎన్ఆర్ఐలకు సైతం కష్టాలు తొలగిపోనున్నాయి.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రతిపాదనను గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్ఆర్‌ఐ సమాజం ప్రశంసించింది.

Advertisement

పట్టాదారు పాస్ పుస్తకం, మ్యూటేషన్‌‌కు సంబంధించి తాను పడ్డ బాధలను రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ గుర్తుచేసుకున్నాడు.జెడ్డాలో నివసించే షకీల్ సుల్తాన్ ప్రతి ఏడాది 30 రోజుల పాటు సెలవుల్లో భారతదేశానికి వచ్చేవారు.

ఆ సమయంలో పుదుర్ మండలంలోని తన వ్యవసాయ భూమికి సంబంధించిన కొత్త పత్రాలను పొందేందుకు గాను ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు వాపోయాడు.

మ్యూటేషన్‌కు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టిందని, పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసి రెండేళ్లు అవుతోందని, కానీ ఇంత వరకు ఫలితం మాత్రం దక్కలేదని సుల్తాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.సెలవుల్లో కుటుంబసభ్యులు, సన్నిహితులతో గడుపుదామని ఇండియా వస్తే పుణ్యకాలం కాస్తా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడానికే సరిపోతోందని ఆయన అన్నారు.వరంగల్ జిల్లా రాజ శ్రీనివాసరావు అనే ఎన్ఆర్ఐది మరో కథ.అబుదాబిలో పనిచేస్తున్న ఆయన గత ఏడాదిన్నరగా తన వ్యవసాయ భూమి మ్యూటేషన్ కోసం కష్టపడుతున్నారు.2018లో తాను వరంగల్ జిల్లా ఆత్మకూరు, వర్థన్నపేట మండలాల్లో వ్యవసాయ భూములను కొనుగోలు చేశానని రాజశ్రీనివాస్ చెప్పారు.నాటి నుంచి తాను టైటిల్ డీడ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నానని.

కానీ వీఆర్ఓల తీరు వల్ల పని ముందుకు కదలడం లేదని ఆయన వాపోయారు.ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు ఎందరో ప్రవాస భారతీయలకు డాక్యుమెంటేషన్ ప్రక్రియలో బాధాకరమైన అనుభవాలు ఉన్నాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

అధికారుల తీరుతో విసిగిపోయిన వీరంతా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల కారణంగా ఇకనైనా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు