వీసా తీసుకోవడం ఒకెత్తైతే దానిని రెన్యువల్ చేసుకోవడం మరొకెత్తు.ఈ క్రమంలోనే ప్రవాసులు తమ వీసాని మరలా రెన్యువల్ చేసుకునేందుకు గల్ఫ్ దేశం కువైట్( Kuwait ) కొన్ని కొత్త షరతులు విధించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అవును, ఇకపై వీసా పునరుద్ధరణకు వలసదారులు తమ అప్పులు, జరిమానాలు, ఇతర బకాయిలు చెల్లించడం అయితే తప్పనిసరి అంటోంది.ఈ నిర్ణయం ఆదివారం అనగా సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఇక ఈ మేరకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.అందుకే ఇకపై ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్లను రెన్యువల్( Residence Permit Renewal ) చేసుకోవాలంటే పాత బకాయిలు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు.అంతేకాకుండా ఇక సెటిల్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్‌లైన్ విధానాన్ని తీసుకు వచ్చినట్టు భోగట్టా.ఇక తమ రెసిడెన్సీ పర్మిట్‌లను మరలా రెన్యూవల్ చేసుకోవాలనుకొనే ప్రవాసులు సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా లేదా ‘సహెల్ అప్లికేషన్'( Sahel Application )ని ఉపయోగించడం ద్వారా తమ అప్పులను క్లియర్ చేయాల్సి ఉంటుంది.

అదే విధంగా అంతర్గత మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టపరమైన నిబంధనలకు ప్రవాసులు కట్టుబడి ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లో ఈ నిబంధనలను ఉల్లంఘించకూడదని అధికారులు ఈ సందర్బంగా పేర్కొన్నారు.ఇది దేశంలో భద్రత, ప్రజా క్రమాన్ని కాపాడటంలో ఎంతో సహాకరిస్తుందని, దయచేసి అందరూ సహకరించాలని చెప్పుకొచ్చారు.ఈ విధి విధానాల వలన చాలా మేలు చేకూరుతుందని, దానిని ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు.ఇక బాధ్యతాయుతమైన ఆర్థిక విధానాల పట్ల ప్రభుత్వ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని, దేశం మొత్తం స్థిరత్వం మరియు భద్రతకు దోహదం చేస్తుందని మంత్రిత్వశాఖ ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది.
కాబట్టి ప్రవాసులు( NRIs ) ఎవరైతే వున్నారో వారు ఈ విషయమై ఒక్కతాటిపైకి రావాలని, సహకరించాలని సూచించారు.







