డ్రాగన్ అనే పదం వింటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది చైనా దేశం.చైనా దేశాన్ని డ్రాగన్ కంట్రీ అని మనం పిలుస్తూ ఉంటాము.
ఇటీవల కాలంలో సరిహద్దులలో చైనా బలగాలు భారత సైన్యాలను హతమార్చిన అనంతరం రెండు దేశాల మధ్య మరింత విభేదాలు, గ్యాప్ చాలా ఎక్కువ అయింది.అప్పటి నుంచి మన దేశంలో చైనా యాప్స్ ను నిషేధించడం, చైనా వస్తువులను నిషేధించడం, అలాగే వాణిజ్య సంబంధాలను కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అందుకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన రావడం మనం చూశాం.
అలాగే డ్రాగన్ ఫ్రూట్ కి తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఒక ఆలోచన వేసి ఆ పండు పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది.
డ్రాగన్ పండు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని.
గుజరాత్ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ పేర్కొన్నారు.అలాగే ఆ పండు పేరును మార్చాలని నిర్ణయించుకున్నట్లు డ్రాగన్ అనే శబ్దం ఆ పండుకు సరిగాలేదని, అందుకొరకు డ్రాగన్ పండు పేరును కమలం అని మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు.
ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉద్యానవన అభివృద్ధి పనులు ప్రారంభించిన తరుణంలో గుజరాత్ ప్రభుత్వం తెలియజేసింది.ఇక ఇప్పటి నుంచి గుజరాత్ ప్రభుత్వ ప్రజలు డ్రాగన్ పండును కమలం పండు అని పిలుస్తుందని సీఎం విజయ్ తెలియజేశారు.

డ్రాగన్ పండు ను కమలం పండు అని పిలవడానికి గల ముఖ్యకారణం చెప్తున్న తరుణంలో కమలం పువ్వు ఆకారంలో పండు ఉండడంతోనే ఆ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.ఈ పేరు మార్పు విషయంలో ఎలాంటి రాజకీయం లేదని సీఎం స్పష్టంగా తెలియజేశారు.ఈ నిర్ణయం తీసుకోవడం వలన ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని, అలాగే మరో వైపు బీజేపీ ఎన్నికల గుర్తు కావడం, గాంధీ నగర్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయం పేరు కూడా శ్రీ కమలం కావడం కూడా గమనించవలసిన విషయంగా మారింది.