జామపండును నైవేద్యంగా పెడితే కలిగే లాభాలు ఏమిటో తెలుసా?

ప్రతి ఒక్కరు తమ ఇష్ట దైవానికి పండ్లను సమర్పించటం మాములుగా జరిగేదే.

అయితే కొన్ని రకాల పండ్లను నైవేద్యంగా పెడితే సిరి సంపదలు పొందటమే కాకుండా అనేక లాభాలు ఉన్నాయని పురోహితులు, జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

దేవునికి జామ పండ్లను నైవేద్యంగా పెడితే సకల సంపదలు పెరగటమే కాకుండా రాజ మర్యాదలు జరుగుతాయి.రుద్రాభిషేకం సమయంలో జామ పండు జ్యుస్ తో అభిషేకం చేస్తే అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి.

గణపతి విగ్రహానికి కుడివైపున తాంబూలంతో జామ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే అధిక లాభం కలుగుతుంది.శ్రీలక్ష్మీనారాయణ దేవునికి నైవేద్యం పెట్టిన జామ పండ్లను కొత్త దంపతులకు ఇచ్చి తినమని చెప్పితే వారిలో కలహాలు రాకుండా అన్యోన్యంగా ఉంటారు.

దుర్గాదేవీకి దీపనమస్కారాలు చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే సంతానం లేని వారికీ సంతానం కలుగుతుంది.గౌరీ దేవికి నైవేద్యంగా పెట్టిన జామ పండును తింటే మానసిక ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

Advertisement

పెళ్లి కానీ అమ్మాయిల చేతుల మీదుగా జామ పండ్లతో పూజ చేయించి ఆ జామ పండ్లను సుమంగళులకు తాంబూలాలుగా ఇస్తే తొందరగా పెళ్లి అవ్వటమే కాకుండా మంచి వరుడు లభిస్తాడు.

రవితేజ ఎన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు..?
Advertisement

తాజా వార్తలు