ఈ రోజుల్లో ఇంటర్నెట్ యూజర్లకు సైబర్ సెక్యూరిటీ( Cyber Security ) అనేది లేకుండా పోయింది.తాజాగా సింగపూర్‌లోని గ్రూప్-ఐబీ( Group-IB ) అనే కంపెనీ 1 లక్షకు పైగా చాట్‌జీపీటీ అకౌంట్స్‌ను హ్యాకర్లు దొంగలించి, వాటిని డార్క్ వెబ్‌లో( Dark Web ) విక్రయించారని బాంబు పేల్చింది.
దాంతో యూజర్లు ఖంగుతిన్నారు.గ్రూప్-ఐబీ ప్రకారం, హ్యాకర్ల దాడులు ఏడాది పొడవునా జరుగుతూనే ఉన్నాయి.
ఈ ఏడాది ఒక్క మే నెలలోనే 26,000 కంటే ఎక్కువ ఖాతాలు చోరీకి గురయ్యాయి.సాంకేతిక నైపుణ్యాలకు పేరుగాంచిన ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే ఈ సైబర్ దాడులు ఎక్కువగా జరగడం మరింత షాక్‌కి గురి చేస్తోంది.

చాట్‌జీపీటీని( ChatGPT ) వర్క్ లైఫ్ కోసం ఉపయోగించే వ్యక్తులనే హ్యాకర్లు ఎక్కువగా టార్గెట్ చేశారు.ఈ ఏఐ చాట్‌బాట్ ప్రైవేట్, సెన్సిటివ్ సమాచారంతో సహా సంభాషణల చరిత్రను స్టోర్ చేస్తుంది.హ్యాకర్లు ఈ చాట్ హిస్టరీని కొట్టేశారు. గ్రూప్-IB తన అధునాతన థ్రెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించి ఎక్కువ భాగం దాడులు రకూన్ ఇన్ఫో స్టీలర్ అని పిలిచే ఒక రకమైన మాల్వేర్ వల్ల సంభవించాయని కనుగొంది.
ఈ మాల్వేర్ అనేది కంప్యూటర్‌ల నుంచి పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, క్రిప్టోకరెన్సీ వాలెట్ డేటా వంటి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తుంది.ఆ డేటాను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో అమ్ముకుంటారు.

తమను తాము రక్షించుకోవడానికి వినియోగదారులు పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని, టూ-ఫ్యాక్టరీ అథెంటికేషన్ ఉపయోగించాలని సైబర్ ఎక్స్‌పర్ట్స్ సూచించారు.డార్క్ వెబ్‌లో ఏమి జరుగుతుందనే దాని గురించి సంస్థలు తెలుసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా వారు సున్నితమైన డేటా లీక్‌లను నిరోధించగలరు.ఇక రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ సైబర్ దాడుల ప్రభావాన్ని తగ్గించడానికి, యూజర్ల భద్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.