పెళ్లిళ్లలో చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం.అయితే, వివాహ వేదికపై అతిథుల ముందు వరుడు ( Groom ) తన వధువును( Bride ) కొట్టడం మీరు ఎప్పుడైనా చూశారా? అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతోంది.పాతదే అయినప్పటికీ ఈ వీడియో మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.ఈ ఘటన ఉజ్బెకిస్తాన్‌లో ( Uzbekistan ) 2022లో జరిగినట్లు తెలుస్తోంది.ఈ వైరల్ వీడియోలో వధువు, వరుడు పెళ్లి వేదికపై నిలబడి ఉన్నట్లు చూడవచ్చు.వధువు, వరుడికి అక్కడ సరాదాగా ఓ గేమ్ పెట్టారు.
ఆ గేమ్ ఈ గొడవకు కారణమైంది.సాధారణంగా పెళ్లిళ్లలో ఏదైనా చిన్న పాటి గొడవలు, అలకలు ఉంటాయి.
కానీ వరుడు చాలా దారుణంగా ప్రవర్తించాడు.వధువును అందరి ముందే దారుణంగా కొట్టాడు.ఇది చూసి అక్కడ ఉన్న అతిథులంతా షాక్ అయ్యారు.ఒక్కసారిగా పెళ్లిలో వాతావరణం మారిపోయింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.వివాహ వేడుకలలో వధూవరులకు కొన్ని సరాదా గేమ్స్ పెడుతుంటారు.
ముఖ్యంగా బిందెలో ఉంగరం వేసి, దానిని వెతికి పట్టుకోవాలని భారతీయ సంప్రదాయంలో పాటిస్తారు.గెలిచిన వారు చాలా సంబరపడిపోతారు.
అయితే ఓడిపోయిన వారు ఏ మాత్రం బాధపడరు.గెలిచిన వారికి తమ అభినందనలు తెలుపుతారు.
దేశాలు వేరైనా, సంప్రదాయాలు వేరైనా చాలా దేశాల్లో ఇటువంటి గేమ్స్ వధూవరులకు పెడుతుంటారు.ఇదే తరహాలో పెళ్లి వేదికపై ఉజ్బెకిస్తాన్‌లో వధూవరులకు గేమ్స్ పెట్టగా వరుడు ఓడిపోయాడు.ఆ ఉక్రోషంలో వధువు తలపై గట్టిగా కొట్టాడు.ఆ బాధతో వధువు విలవిల్లాడింది.ఆ తర్వాత వధువు ఏడుస్తూ వేదిక దిగి వెళ్లిపోయింది.ఈ వీడియో ట్విట్టర్‌లో పెట్టగా బాగా వైరల్ అవుతోంది.
వరుడి తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు.ఆ వరుడిని అలా వదిలేయకుండా, అతడిని కూడా గట్టిగా కొట్టి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.